పుట:వెలుగోటివారి వంశావళి.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


క.

అంతకు మునుపే యీవిధ
మంతయు భైరవుని సాక్షి[1] మాటిచ్చి మహిన్
వింతగ రేచర్ల యనన్[2]
మంతుకు నెక్కంగ గ్రామ మచ్చట నిలిపెన్.

9


వ.

మఱియుఁ గులభూషణుండును, వంశవిస్తారకుండును, భైరవవరలబ్ధతేజుండును,
గృహనిక్షేపకర్తయు, నష్టైశ్వర్యసంపన్నుండును, నోరుగంటిపట్టణప్రవర్తకుం
డును, గాకితరాజపూజితబిరుదనామధేయుండును, రేచర్లపురవరాధీశ్వరుం
డును, నగు పిల్లలమఱ్ఱి బేతాళనృపతి మెఱసెఁ దనకీర్తి యాచంద్రతారకముగ.

10


గీ.

యలమిఁ[3] బెంపొందెఁ బద్మనాయకులలోన
వాని వంశంబు లోకంబులోన మెఱయ
ఘనత కెక్కిన రేచర్ల ఘనుఁడు వెలసె
ధరను బిల్లలమఱ్ఱి బేతాళనృపతి.

11


గీ.

అతని తనయులు దామధరాధిపుండు[4]
ధీరగంభీరుఁ డాప్రసాదిత్యఘనుఁడు
రూఢి కెక్కిన రేచర్ల రుద్రవిభుఁడు
నంచితంబుగ ధాత్రిఁ బాలించి రపుడు.

12


శా.

తారుణ్య ప్రధమాన[5]ధైర్యుఁ డగు బేతాళావనిభర్తకున్
ధీరల్ పుత్రులు దామభూపతి ప్రసాదిత్యుండు రుద్రక్షమా
ధారుండున్ జనియించి రంతఁ ద్రిజగద్ధర్మప్రతీపాలన
శ్రీ రాజిల్లఁగ[6] శౌరి ముగ్గురయి ధాత్రిన్ మించినాఁడో యనన్.[7]

13


వ.

అం దగ్రజుండు.

14
  1. A, B భైరవు సాక్షికి
  2. A, B రేచల్ల యనగ
  3. ఎ and య do not rhyme with each other; the correct form of
    the word యలమి is ఎలమి
  4. A. B దామభూనాయకుండు.
  5. A. B కారుణ్యప్రతిమాన The emendation of the editors of V V C is
    accepted above.
  6. B శ్రీరాజిల్లగ వారు ముగ్గురును
  7. V V C. emendation; A B మేటిన్ మించినా రిద్ధరన్
    V. Rao (in Ac. 11. p 286} ధాత్రిన్ మించి నా రెన్నఁగన్