పుట:వెలుగోటివారి వంశావళి.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


వింశతికుచ్చెళ్ళ విస్తారమును గల్గు
        క్షేత్రంబుఁ గాపాడుఁ జిత్రముగను
ఆపాడు తనదిగా నతఁడు గైకొని పండు
        ధాన్యంబు లేటటఁ దనరుచుండ[1]
రేచిగాఁ డనునొప్పుభృత్యుండు పంచముం
        [డురు హ]లముఖమున నొక్క తామ్ర
శాసనమును గని చవి రెడ్డికిని జూప
        శాసనమును గొని వాసి గాఁగ[2]
“భైరవ నీకును బలి యియ్య[3] నవలక్ష
        ధనమంత పచ్చ యి”మ్మనుచు రెడ్డి
పఠియింప విని మ్రొక్కి భయ మింతయును లేక
        పంచమజాతినై ప్రబలఁ గంటి
మీయర్థమంతయు మీ కొప్పియున్నది
        దైవరహస్యంబుఁ దప్పు ననఁగ
నగునె నా దొక విన్నప మవధరించి[4]
యేచఁ డనుపేరు నిలుపుమీయింట ననుచు[5]
నిలువ[6]వలదన్న మానక నిష్ఠచేయ
భైరవుఁడు మెచ్చ బలియిచ్చి ప్రబలె నపుడు.

7


క.

ధర నీగోత్రమునం గల[7]
వరగుణవంతులును శూరవంశపవిత్రుల్[8]
మఱి గంధాక్షతలఁ గొనుఁడు
బరువడి శోభనపువేళఁ[9] బంచము నింటన్.

8
  1. A B. ఆపాడు తనదిగా గైకొని పండ్యెండు ధాన్యంబు లెంటెంట దూరుచుండు
  2. A B. రెచిగాండన నొప్ప భృత్యుండు పంచముం డలముఖంబున నొక్క తామ్రశాసనము గన్గొని యేలిక యగు రెడ్డికిని జూప శాసనము గని వానివాసి గాగ.
  3. A B. బలియిచ్చునతనికి
  4. A B. గాదనంగ మాను నా దొక విన్నప మాచరింప
  5. A B. రేచడను పేరు మీయింట నిలుపుడనుచు
  6. A B. లేవక వలదన్న మానక నిష్టచేయ
  7. A B. గోత్రమునగల్గు
  8. A B. శూరులు వంశపవిత్రులు
  9. A B. వేళను