పుట:వెలుగోటివారి వంశావళి.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి


కదనమున నడచు నప్పుడు
వదలక మాముందు నడువవలె నని పలికెన్.

2


క.

చేకొని యాబేతాళుఁడు
ప్రాకటముగఁ బలికె నపుడు భాసురలీలన్
నీ కెమ్మెయి నారాకకుఁ
దేఁకువఁ గనునట్ల తీర్తు ధృతిఁ గను మనుచున్.

3

* * *

సీ.

నలినగేహాసమున్నతనితాంతస్తన
        ప్రసవగుచ్ఛములకు భ్రమర మగుచు
వాసవముఖగీర్వాణకోటీరాగ్ర
        రమ్యనాయకరత్నరాజి యగుచు
వివృతాతిశయహృద్యవేదాంతపంజర
        గృహనిత్యశారికావిహగ మగుచు
నిరపాయఫలధురంధరషడక్షర[మంత్ర]
        ఘనవనీమదకలకంఠ మగుచు
బరఁగు లక్ష్మీమనోభర్తపాదయుగళ
మందు జనియించె సకలార్థిబృందమునకు
శరణమై గాఢశోభనాచరణ మగుచు
వెలమవంశంబు గాంభీర్యవిలసనంబు.

4


గీ.

వెలయు తత్పద్మనాయకకులమునందు
నభ్యుదయ మొందె ఘనుఁడు మహామహుండు
వినయరేచర్లగోత్రుండు విజయశాలి
[1]తనరఁ బిల్లలమఱ్ఱి బేతాళినృపతి.

5


వ.

ఆపిల్లలమఱ్ఱి బేతాళనృపతి విధం బెట్టి దనిన.

6


సీ.

[2]అరుదైన పూర్వపుటనుమగ ల్దక్షిణ[3]
        భాగంబునం దొక్కభైరవుండు

  1. A. B. యనఁగ
  2. The text of this Sisamalika is in a very corrupt condition. The forms అనుమనగల్ and అనుమగల్ are both used in the text.
  3. A. B. అరుదైన పూర్వప్రతిమనుగంటి దక్షిణ