పుట:వెలుగోటివారి వంశావళి.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

వెలుగోటివారి వంశావళి


యటమున్న యిద్దఱు నాచెంత దున్నుచో
        వానగాలియు రాఁగ వడిగఁ బోయి
వటమూల[1] బిలములో వడిఁ జొచ్చి యుండియు
        నచట బేతాళుని యాదరమునఁ
బ్రత్యక్షమున నిల్చి భయ మింతయును లేక
        మాట లాడెడు రెడ్డి మఱిఁగి[2] చూచి
వెఱచి యూరక యుండి, వెనుక నింటికిఁ బోయి
        యావార్త నూరిలో నపుడు చెప్ప
నూరెల్లరును గూడి యుబ్బుచుఁ జూడంగ
        నావార్త గణపతి యపుడు వినియెఁ
జెవ్విరెడ్డిని జూడఁ జేకొని పిలిపించి
        యాదరం బొదవంగ నతనిఁ జూచి
అసహాయశూరుఁ [డౌనని యాత్మఁ దలపోసి]
        చెన్నుమీఱఁగ లక్షసీమ నిచ్చి[3]
డాలు డమారంబు తాళి చేకట్లును[4]
        గజహయంబుల నిచ్చె ఘనతతోడ
హెచ్చుగా నాతని [మెచ్చి] పిల్లలమఱ్ఱి
        బేతాళరా వని పే రొసంగ[5]
నదియు మొదలుగ జనులెల్ల నభినుతింప
రమణతోడుత విలసిల్లె రావు పేరు
వాసి కెక్కిన రేచర్లశాసనుండు
దనరెఁ బిల్లలఱ్ఱి బేతాళుఁ డనఁగ.

1


క.

[6]ఇదియునుగా కిం కొక్కటి
ముదమున వేఁడెదము వరము మూర్ధన్యులమై

  1. A. B. వటముల
  2. A. B. మరియు
  3. A. B. అసహాయశూరుఁడని తలఁచి, చెన్నుమీరగ లక్షసీమయిచ్చి
  4. A. B. చేపట్లును
  5. A. B. హెచ్చుగా నతనికి పిల్లలమఱ్ఱి భేతాళరావుపేరు దయ నొసంగి
  6. A. B. ఇదిగాకను. This verse and the following recount a dialogue between Cevvı Reḍḍi and the demon Bētāḷa. They hang loosely in the text having no connection whatever with what preceeds and what succeeds. Probably they have been intorpolated.