పుట:వెలుగోటివారి వంశావళి.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

3


మాపటంతఁ[1] దిరిగి మఱి యింటి కరుగుచోఁ
        జీకటిపడవచ్చెఁ జేనిబైటఁ
దొలకరివానయుఁ బలపల వచ్చినఁ
        ద్రోవ చేరువయందు దొడ్డడొంక[2]
కాచెంత నొకవృక్ష మమరుఁ బిల్లలమఱ్ఱి
        బేతాళవట మని పేరు గలిగి
యున్నవృక్షము క్రింద నొప్పుగా నిలుచుండ[3]
        భీకరంబుగ నొక్కపిడుగు పడిన
శంక యించుక లేక సంతోషచిత్తుఁడై
        కఱ్ఱ చేఁబట్టుక కదిసి[4] నిలుచు
కరణి బేతాళుండు గనుఁగొని యప్పుడు
        కరుణతో నాతని గౌఁగిలించి
[5]బేతాళుఁ డొకమాట ప్రీతితోఁ బలికెను
        గడు వేడ్క పుట్టంగఁ గడకు వచ్చి
“నీకు నానామంబు నెమ్మితో నిచ్చెదఁ
        బూనుము నా పేరు [పోణిమి దగఁ]
బొసఁగంగఁ దాల్చిన [నెసఁగు] నైశ్వర్యంబు
        వెయ్యేఁడు లగు”నని , వేడ్కఁ జెప్పి[6]
బేతాళుఁ డరిగిన వెనుక నింటికిఁ బోయి
        సంతోషపడుచుండె చవ్విరెడ్డి[7]

  1. A. B. మాపటెంతట
  2. A. B. దొడ్డ దొకటి
  3. A. B. నిలుచున్న
  4. A కదశికదశి B కదిశికదిశి
  5. The following three lines are in a corrupt condition –
    భేతాళు డొకమాట ప్రీతితో బలికెను నీకు నామంబు నెమ్మితో నిచ్చెద
    మనిన వేడుకబుట్టి కడకు వచ్చి పూనుము నాపేరు పొసగంగ దాల్చిన
    అయిశ్వర్యంబు వెయ్యేండ్లు యగునని యానతిచ్చె
  6. A. B. ఆనతిచ్చె; but as ఆ does not rhyme with వె, వేడ్కఁ చెప్పి has been substituted.
  7. A. B. సంతోషపడుచున్న చవ్విరెడ్డి. The two forms చెవ్వి and చవ్వి are employed in this poem. The adoption of uniform method of spelling is precluded by the requirements of prosody.