పుట:వెలుగోటివారి వంశావళి.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

వెలుగోటివారి వంశావళి


[1]“నిట్టివిచారంబు లేటికి నీకును
        దను బలిగాఁ జేసి ధనముఁ గొనుము
తనపేరితోడను దనరెడు రేచర్ల
        గోత్రంబు పూనుము కొమరు మిగుల
మా వంశభవుఁ డెంతమేటి యైనను [దాను][2]
        బెండ్లి యాడెడు వేళఁ బేర్మితోడఁ
దనవంశమునఁ బుట్టి తనరెడు పంచము
        పెండ్లి ముందఱఁ జేయఁ బ్రీతి మీకుఁ
గలిగియుండినఁ దన్ను బలిగా సమర్పించి[3]
        ధనము గైకొను” మని తనకుఁ జెప్ప
నా రేచఁ డాడిన యామాటవిని రెడ్డి
        వానితో నొకమాట [4]వఱలఁ బలికె
రేచనికోరికె రెడ్డి కానిమ్మని
        సంతోషచిత్తుఁడై సమ్మతించె
వానికి నమ్మిక వలనుగా నిచ్చియు
        వానిని బలిగాగఁ[5] బూనిచేసి
నిక్షేప మప్పుడు నెరయఁ దాఁ గై కొని
        కొమరొంద రేచర్లగోత్రుఁ డయ్యె
ఆ చెవ్విరెడ్డియు నంత సంతసమునఁ
        [జెలువు మీఱఁగ బోయి] చేనిఁ జూచి[6]

  1. The order of the following sıx lines has been changed, as the order in the original makes the meaning of the whole of the passage unintelligible.
  2. The matter enclosed within the brackets throughout this work has been added
  3. A. B. బలియుగా నొనరించి
  4. A. B. వవర
  5. A. B. బలియు
  6. A. ఆ చవ్విరెడ్డి ఇంతట సంతోషమున పోయి చేను జూచి. The reading of B is ఆచవ్వి రెండి డంతట