పుట:వెలుగోటివారి వంశావళి.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

సీ.

అనుమనగ ల్లను ఘనమైన పురమున
        ననుమనగంటి గోత్రాన్వయుండు
పొలుపొందు చేయూరి పోలిరెడ్డిసుతుండు
        రెండెడ్లఁ[1] గట్టుక రేచఁ డనెడు
పంచముండును దాను బహుదినంబులనాఁటి
        పాటిమీఁదటిచేను పరఁగ నపుడు
దున్నుచో నాఁగేటితుదఁ దాఁకి పైరాయి
        పగుల నిక్షేపంబు బైటఁ బడిన
నా రెడ్డి కనుఁగొని యానందమును బొంది
        తా నది కైకొనదలఁచి నపుడు
ఆకాశముననుండి యశరీరవాణియు
        భీకరంబుగఁ బల్కెఁ బ్రీతితోడ
‘నరబ లిచ్చినఁ గాని నవలక్షధన మంత
        నీకుఁ గైకొనరాదు నియమ మిద్ది’.[2]
ఆమాట విని చాల [3]నాత్మలో వగవంగ
        నేల వగచె దని యేచఁ డనియెఁ[4]
‘దాను బెండ్లామును దనయుండు దప్పిన
        నరబలి కెవ్వరు నాకుఁ గలరు.’[5]
అని విచారముతోడ నలమట నొందెడు
        రెడ్డితో నొకమాట రేచఁ డనియె

  1. A. రెండెంళ్లు ; B. రెండేళ్లు
  2. A. B. నీకు గైకొనరాదె నెనరుతోడ
  3. A. అంత్తలో
  4. A. B. రేచ డనియె. The two forms రేచ and ఏచ are employed in this work. It is not possible to adopt a uniform method of spelling the word, owing to the considerations of prosody.
  5. A B నాకు యిచట