పుట:వెలుగోటివారి వంశావళి.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

101


సరససత్కవిగోష్ఠిసార్వభౌమ,
వెలయ వెలుగోటిపినకొండవిభునిరాయ[1].

288


సీ.

కుంతలావంతికకురు[విదేహ]విదర్భ
        [2]మోహనభూముల మొలక మొల్చి
కాశ్మీరకాంభోజకరహాటకర్ణాట
        వింధ్యదేశములందు వేళ్లు పాఱి
పాంచాలబర్బరబాహ్లికఘూర్జర
        సింధుదేశములందుఁ జిగురు లొత్తి
అంగవంగకళింగబంగాళనేపాళ
        పుణ్యదేశములందుఁ బూచి కాచి
ఘనత కెక్కెను నీదానకకల్పతరువు
లరిజయోపాయ పట్టుతలాటరాయ
ప్రకటధౌరేయ వెలగోటిపార్థివేయ
విక్రమోపాయ పినకొండవిభునిరాయ.

289


సీ.

మదవిరోధుల[3] శిరోమణులు నేత్రంబులు
        దర్పితారాతికేతనము పడగ[4]
దుర్మదవిద్విషచ్చర్మంబు కుబుసంబు
        శత్రువరాట్టహాసంబు మ్రోఁత
శాత్రవరాజన్యశల్యముల్ కోరలు
        సమదారివీరరసంబు విషము
బిరుసైనపగతురప్రేవులు జిహ్వలు
        వినుతరాడ్జీవానిలములు భుక్తి[5]

  1. A.B. రాయవిభుని
  2. A.B. విదర్భమోహనభూము లలరు
  3. A.B. మదద్విరోధుల
  4. A.B. పడిగె
  5. A.B. మదితరాడ్జీవానలము భుక్తి గాగ