పుట:వెలుగోటివారి వంశావళి.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

వెలుగోటివారి వంశావళి


సీ.

ఇమ్మైన సొమ్ముకా[1] యింతిపే రే మది
        యొకగొందిపేరింటి యువిద యేది
మేడపేరన నగు[2] మించినసఖి యేది
        తగఁజేతిపేరిటి తరుణి యేది
వివరించుమాటలు వినుపేరిసఖి యేది
        మెకములపేరింటి[3] మెలఁత యేది
నలుదిక్కులకు నొక్కనలినాక్షిపే రేది
        రత్నంబుపేరిటి రమణి యేది
రమణులకు [నెల్ల] నొక్కడె రాజురాజు
దశమినవముల లెక్కింపఁ దగిన సతులు
అందులను[4] గల్గుభావంబు లానతిమ్ము
సరససత్కవిసద్గోష్ఠిసార్వభౌమ
వెలయ వెలుగోటిపినకొండవిభునిరాయ.

287


సీ.

కలికి సొంపున[5] బల్కి విలుకోపునను బూని
        వృక్షమౌ పేరిట వెలయు నొకటి
వదరుఁ గూతలపేరఁ[6] బొదలి చెట్టుగ నిల్చి
        నదితోడఁ గూడంగ విదిత మొకటి
యరికట్టుమాటలోఁ గరఖడ్గ మొనరించి
        రాజాన్న[7]రుచులలో రమ్య మొకటి
వలనుగా దని పిల్వవచ్చిన పేరితో
        నరయ ఝంకారించు గరువ మొకటి[8]
తివిరి భావంబు చతురత తేటపడఁగ
నర్థ మిది నాల్గుదెఱఁగులు నానతిమ్ము

  1. A. సొమ్మురా
  2. A.B. మెడపెరననగుచు
  3. A.B. మెకముతల
  4. A.B. అందరను
  5. A.B. సొమ్మురా
  6. A.B. వదురుగూతలపేరు
  7. A.B. రాతాన్న
  8. A.B. వచ్చును పేరిలో...... గురుతుదాని