పుట:వెలుగోటివారి వంశావళి.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

వెలుగోటివారి వంశావళి


గాఁగ[1] సోలుచు నాడుచుఁ గడిమి[2] మెఱసి
రణశిరంబున[3] నిల్చు ఘోరాహి యనఁగ
సరగఁ[4] గ్రీడించు నీఖడ్గసర్పరాజు
విమలచారిత్ర పినకొండవిభుసుపుత్ర.

290


సీ.

కరమెత్తి నీకు మ్రొక్కనిరాజు లెవ్వరు
        గర్జించు బల్లరగండబిరుద
కలనిలో[5] నీకుఁ జిక్కనిరాజు లెవ్వరు
        మదవైరివీరదుర్మదవిదారి
అనిలోన నీకు నోడనిరాజు లెవ్వరు
        రమణీయఖడ్గనారాయణాంక
వసుధలో నిన్నుఁ గొల్వనిరాజు లెవ్వరు
        కొసరక రేచర్లగోత్రధీర
అనుచుఁ గొనియాడుదురు నిన్ను నాంధ్రయవన
మగధమాళవనేపాళమత్స్యసభలఁ
బ్రకటధౌరేయ వెలుగోటిపార్థివేయ
విక్రమోపాయ పినకొండవిభునిరాయ.

291


క.

మతి నభ్యసింపవచ్చును
బ్రతి లే దన సకలకళలు[6] రానివి రెండే
యతిదుర్లభములు విక్రమ
వితరణములు పిన్నకొండవిభురామనృపా.

292


ఉ.

రాయపనాయఁ డాసుకవి రాజమరున్మణి తిమ్మధారుణీ
నాయకుఁ డాసమస్తజననాథశిరోమణి పిన్నకొండధౌ
రేయుఁడు నంతకంటె సుచరిత్రుఁడు తత్తనయాగ్రగణ్యుఁడౌ
రాయపనేఁడుఁ బూర్వులతెఱంగునఁ బ్రస్తుతికెక్కె ధారుణిన్.

293
  1. A.B. కణగి
  2. B. కరిమి
  3. A.B. పురంబున
  4. A.B. చెలగి
  5. A.B. కదనమున
  6. A.B. కథలు