పుట:వెలుగోటివారి వంశావళి.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

97


యన్వయోచితసంవృత్తి యతనిసొమ్ము
అఖిలవృద్ధోపసేవ[1]నం బతనిసొమ్ము
అనుచు లోకులు వినుతింప ఘనత కెక్కె
సుప్రభుండు కుమారతిమ్మప్రభుండు.

278


క.

ఆనయనీరధియనుజుఁడు
కోనయ శాత్రవులఁ దృణముఁ గొఱికింపఁగఁ[2] బా
డైన యవసంబు[3] దన్మహి
ళానయనాంబువులఁ బశువులకుఁ గాఁ బెరుఁగున్.

179


చ.

తదనుజుఁ బెద్దకొండవసుధావరు మార్కొని త్రెవ్వి[4] నెవ్వడిన్
ద్రిదశపురంబుఁ జొచ్చిన యరిక్షితిపాలురనెత్తు రుత్పత
త్పదనఖలాక్షయై కటికిఁ బావడయై వలిగుబ్బదోయికిన్
గదురు జవాదియై రతి నొకానొకచె ల్వొడఁగూర్చు రంభకున్[5].

280


ఉ.

ఇమ్ములఁ బెద్దకొండధరణీశ్వరచంద్రుఁడు దాడివోవుచోఁ
గమ్మలు వ్రాయ సర్వకటకంబుల కాఁపులు దారిఁ బాఱిలో
కమ్మలు బోయమూఁక లనఁగా నిలు పోపక పోదు రానినన్
గుమ్మెలు పోవు లోక మెఱుఁగున్ దదుపార్జితహేతిధారలన్[6].

281


సీ.

మాంసల[7] ప్రతిపక్షమండలేశ్వరమహో
        న్నతకంధరంబుల నఱికి నఱికి
వికటాభియాతి పృథ్వీనాథఘనవిగ్ర
        హోరుచర్మంబుల నొలిచి యొలిచి[8]

  1. A.B. వృద్ధాపసేవ
  2. A.B. గొరికింపంగా బా
  3. A.B. యవసరంబు
  4. A.B. త్రెల్వి
  5. A.B. రతినాకానాకుచల్వడగూర్చురంభకున్
  6. A.B. కమ్మలు పోయి సర్వకటకంబులకౌ ఘనుదాకి పారి లో
    కమ్ములు బోయమూక లనగా నిలుపోపక పోదు రానినన్
    కమ్మలు పోపులోక మెరుగున్ తదుపార్జితధాజాతికిన్.
  7. A.B. మాంసత
  8. A. వికటాభియతపృథ్వినాయక విగ్రఘనహోరుచర్మంబులు వొలిచి వొలిచి
    B. ....హేమ....