పుట:వెలుగోటివారి వంశావళి.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

వెలుగోటివారి వంశావళి


దిక్కోటీయుతసాంద్రచంద్రరుచికీర్తిన్ బిన్నతిమ్మప్రభున్
వాక్కాంతాపతిఁ[1] గొండధీరుఁ గనియెన్ వారాశిగంభీరునిన్.

275


వ.

తత్కుమారవర్గంబునం దగ్రజుండు.

276


సీ.

తనువాసనాధైర్యధర్మాణిమాదులఁ
        గాంచనాచలధర్మకలనవాఁడు
మతిభోగ[2]శక్తిసంతతవిష్ణుభక్తుల
        శారదేంద్ర[3]కుమారసరణివాఁడు
నతపోషణారూపనయశౌర్యరేఖల
        హరిభావభవగురుస్ఫురణవాఁడు
బలశౌభ్ర్య[4]దానకృపావిశేషంబుల
        రామచంద్రఘనాభిరతులవాఁడు
నిహతసామంతసీమంతినీనితాంత
తాంతహృదయాంతకాంతసంతాపదశది
శాంతవిశ్రాంతకీర్తిలతాంతకుంత
కాంతుఁడు కుమారతిమ్మభూకాంతుఁ డలరు.

277


సీ.

సంతతసత్యభాషణము లాతనిసొమ్ము
        లతివేలతరధర్మ మతనిసొమ్ము
భవ్యప్రసాదసౌభాగ్య మాతనిసొమ్ము
        ఆశ్రితావనఫల మతనిసొమ్ము[5]
దానవాహితపదధ్యాస మాతనిసొమ్ము
        మితిలేనిసంపద లతనిసొమ్ము
వలరాజుఁ బురుడించు చెలువ మాతనిసొమ్ము
        ఆహవకౌశల మతనిసొమ్ము

  1. A.B. వాక్కాంతామతి
  2. A.B. మరిభాగ
  3. A.B. శారదేందు
  4. A.B. శౌర్య, 'శౌచ' అనియు బఠింపవచ్చును
  5. A.B. ఆశ్రితానఖల మతనిసొమ్ము