పుట:వెలుగోటివారి వంశావళి.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

95


దీక్ష్ణమైన వరాహదేవదంష్ట్రాంకుర
        సూచికాగ్రంబున సొంపు గనియు
ఘోరమైన యనంతకుండలిభోగ[1]ప్ర
        దీప్తభాగంబునఁ దేజరిలియుఁ
గఠినంబులైన దుర్గమ[2]మహాశైలేంద్ర
        వికటరూపంబులు విరివి గొనియు
ధీరతప మాచరించి ధాత్రీవధూటి
నిల్చు వెలుగోటిపినకొండనృపశశాంకు
సంకుమదపంకసంకీర్ణకుంకుమాంశు[3]
మిళితకేయూరమణిభుజార్గళమునందు.

272


మ.

అల ధీరుండగు పిన్నకొండపకు రమ్యాకార తిమ్మాంబ ని
ర్మలధర్మోజ్వల[4] యక్కమాంబ తరుణీరత్నంబు సింగాంబయున్
గల రంచత్కరుణా[5]క్షమాపతిహితైకశ్రీల శ్రీ[6]భూమినీ
ళలచందంబున నాత్మభర్తకు మనోల్లాసంబుఁ గల్పించుచున్.

273


శా.

ఆతిమ్మాంబకుమారకుల్ మెఱసి రత్యాశ్చర్యమార్తాండలీ
లాతేజుండు కుమారతిమ్మపయు హేలావారకాంతామణీ[7]
చేతోజాతుఁడు కోనధీరుఁడు బుధశ్రేణీనుతాఖ్యాతి[8]వి
ఖ్యాతుండౌ పెదకొండశౌరి సుబలుం[9] డారాయభూపాలుఁడున్.

274


శా.

అక్కాంతామణి కాంచె రంగవిభు నేచాధీశుఁ దిమ్మక్షమా
భుక్కోటీరుని, సింగమాంబ మదనాభున్[10] బెద్దతిమ్మప్రభున్

  1. A.B. యోగ
  2. B.P. హోమ
  3. A.B. కుంకుమంబు
  4. B. P. ధర్మాఖ్యల
  5. A.B. గలరంచత్కరుణ
  6. A.B. స్త్రీ
  7. A.B. కుమారతిమ్మఘనుఁడేలాగంధచూడామణీ
  8. A.B. ఖ్యాత ; B.P. ఖ్యాతి
  9. A.B. సులభుండు
  10. A.B. మదనాథున్