పుట:వెలుగోటివారి వంశావళి.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

వెలుగోటివారి వంశావళి


వ.

అతని యనుజుండు.

268


ఉ.

సంతతదానకర్ణుఁడు లసద్గుణపూర్ణుఁడు రూపరేఖికా
కంతుఁడు సర్వభూమిధవకాంతుఁడు మారుతవేగవాజిరే
వంతుఁడు నిర్వితర్క[1]బలవంతుఁడు మత్తగజాధిరోహణా[2]
శ్రాంతుఁడు తిమ్మభూవిభుఁడు చక్రిసమానుఁడు రాజమాత్రుఁడే.

269


క.

అల గనితిమ్మధరిత్రీ
తలనాథలలాము కూర్మి తమ్ముఁడు కరుణా
జలధి[3] పినకొండనరపతి
వెలయున్ సకలార్థినిలయవిబుధద్రుమమై.

270


సీ.

హరివీరవరలంఘనావమానంబున
        గౌరవం బెడలని కంధిరాజు
జంభారిదంభోళిసారధారాహతిం
        బక్షముల్ గోల్పోని భర్మశిఖరి
పృథ్వీమరుజ్జయాపేక్షఁ 'గుంజర' యంచు[4]
        బొంకు బొంకని ధర్మపుత్రకుండు
రాధేయుదృఢబాణబాధ వీటికి[5] భీతి
        నొంది పాఱని శక్రనందనుండు
సాటి సవతు సదృక్షంబు సన్నిభంబు
వితతగాంభీర్యధైర్యసూనృతపరాక్ర
మముల వెలుగోటిపినకొండమనుజనాథ
మకుటమాణిక్యమునకు భూమండలమున.

271


[6]*సీ.

గంభీరమగు నంబుగర్భంబున ఘటిల్లి
        కూర్మాసనంబుపైఁ గుదురు కొనియుఁ

  1. A.B. నిర్వితర్క్య
  2. A.B. రోహణ
  3. A.B. జలనిధి
  4. A. మంత; B. కుంత
  5. A. భాదావీధికి; B. బాధవీధికి
  6. The verses marked with * have been extracted by the compilers of the chronicle from the Bhānumatīpariṇayam of Renṭūri Rangarāju.