పుట:వెలుగోటివారి వంశావళి.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

93


వులప ల్నాగులపాడు వాడపలియు న్నువ్వెత్తుగాఁ[1] జేకొనెన్
భళి వెల్గోటికుమారతిమ్మఁడు ధరాభర్తల్ భయం బందఁగాన్.

263


మ.

రఘురాముం డెఱదిమ్మరా జనుపఁగా రంజిల్ల హన్మంతుఁడై[2]
ఖగరాజై వెలుగోటితిమ్మఘనుఁడే గాంభీర్యశౌర్యంబులన్
బగవారిం దెగటార్చి రాజహితుఁడై భాసిల్లె నెల్లప్పుడున్
దగు నారాజుకు మన్నెశేఖరునకున్ దద్వైఖరిన్ బోల్పఁగన్.

264


చ.

తివిరి నితాంతకుంతమునఁ దిమ్మయతిమ్మవిభుండు గ్రుమ్మినన్
యవనులు నేలఁ గూలు సమయంబున నాలుక సాఁచి తత్తను
స్స్రవదరుణంబుఁ గ్రోలి ఫెలుచన్ దిశ లల్లలనాడ ద్రేఁచు[3] భీ
మవిధిని గొండవీటికడ మండలదీవిని భూతజాలముల్.

265


వ.

అతని కుమారుండు.

266


సీ.

తన జనార్దననామమునకు భూషణముగా
        జనులఁ బోషించు నాసక్తిఁ దొడరి
భూపతిత్వము దాల్చు భువనమోహనమైన
        సౌందర్య[4]విభ్రమచ్ఛాయఁ బ్రబలి
బంధుమిత్రామాత్యసంధానసౌభాగ్య
        పరమసంపత్కరప్రౌఢిఁ దనరి
సింహాసనమున విచిత్రకారణముగా
        సకలపాండిత్యబు సంగ్రహించి
పూని రేచర్లకులవార్ధిపూర్ణచంద్రుఁ
డనఁగ మారకపురిచెన్నుఁ డవతరించె
వేడ్క వెలుగోటిగనితిమ్మవిభుకుమార
తిమ్మయప్రభు చెన్నపృథ్వీశ్వరుండు.

267
  1. A.B. ఉచ్చారణసామ్యమువలన భ్రమపడి కవి 'వు' 'ఉ' లకు యతిమైత్రి కల్పించియుండవచ్చును.
  2. A.B. రఘురాముం డెరదిమ్మరాజు వద్దన్ రంజిల్లు హనుమంతుడై. ఇందు వర్గప్రాస ముపయుక్తము.
  3. B. ద్రెచ్చు
  4. A.B. సొంపారు