పుట:వెలుగోటివారి వంశావళి.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

వెలుగోటివారి వంశావళి


వాడపలి నీవు గైకొని వఱలువేళ
గడమదుర్గంబు లన్నియుఁ గలువరించె
నెన్న వెలుగోటితిమ్మయ చిన్నతిమ్మ
మహి మహేంద్ర కుమారతిమ్మక్షితీంద్ర.

261


సీ.

రామరా జెఱదిమ్మభూమీశుపంపున
        మలఁజొచ్చి బోయల బెళుకుఁ దీర్చె[1]
ముస్తఫా ఖానుని ముస్తీదుఁ[2] జెడఁ దోలి
        భద్రగజంబులఁ బట్టితెచ్చె[3]
మొనసి దేవరకొండ మూఁకలు వచ్చిన
        ఘోరాజి శిరములఁ గొట్టివేసెఁ[4]
జలపట్టి[5] యిభరాముశాహు పంపుల నెల్ల
        ధరఁ గృష్ణసాక్షిగా దఱిమి గెల్చె[6]
నిట్టి విజయంబు లెన్ని లే వెన్ని చూడ
రాజమాత్రుండె వెలుగోటి రాయపేంద్రు
తిమ్మఘను చిన్న తిమ్మధాత్రీశసుతుఁడు
మహితయశుఁడు కుమారతిమ్మప్రభుండు.

262


మ.

ఆరామ ప్పెఱ[7]దిమ్మరాజమణియు న్నావేంకటక్ష్మాపుఁడున్[8]
సెల వన్నంతనె యేఱు దాఁటి గడెలోఁ జిట్టేల పేరూరు దే

  1. A.B. బెరకుదీర్చి
  2. A.B. ముస్తీలు
  3. A.B. తెచ్చి
  4. A.B. వేసి
  5. A.B. చనకి
  6. A.B. గెల్చి
  7. A. హరిరామప్ప
  8. A.B. క్ష్మాపతిన్