పుట:వెలుగోటివారి వంశావళి.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

91


నతఁడు బల్లరగండ కేళాదిరాయ
గాయగోవాళ గండరగండ చండ
సర్వబిరుదుల కొమరవేశ్యాభుజంగ
బిరుదభరితుండు చినతిమ్మనరవరుండు.

259


సీ.

తననేత్రనీరజద్వయము సంపద లిచ్చు
        నిగురుఁబోఁడికిఁ బుట్టినిల్లు గాఁగఁ
దనయశఃకందుకం బొనరు మాటమిటారి
        యుబ్బుచన్గవకుఁ బెన్నుద్ది గాఁగఁ
దనముద్దుమోము కాంతాదృక్చకోరదం
        పతులకు నెఱ చందమామ గాఁగఁ
దనప్రతాపాగ్ని కందర్పదర్పధ్వంసి
        చుఱుఁ గంటికిని నీడు జోడు గాఁగఁ
వెలసె నెవ్వాఁడు మధుమదావృతతురుష్క
వర్మరక్తరసచ్ఛటావర్ధమాన
భంగసంఘాత[1] కృష్ణాతరంగిణీశుఁ
డధిపమాత్రుండె పిన్నతిమ్మవనివిభుఁడు.

260


సీ.

శ్రీకరంబుగ నీవు చిట్టేలఁ గైకొన్న
        దేవరకొండకు దివులు పుట్టె
భీకరంబుగ నీవు పేరూరుఁ గైకొన్న
        నానల్లగొండ శౌర్యం బణంగె
దేవులప ల్లీవు ఠీవితోఁ గైకొన్న
        నరవపల్లెకు జయం బల్లఁదొలఁగె[2]
నాగులపా డీవు[3] వేగమె కైకొన్నఁ
        దూలుంద్రగొండ[4] గగ్గోలువడియె[5]

  1. A.B. గాధసాధూత
  2. A.B. జయంబెల్లదొలగె
  3. A.B. నాగులపాడు నీవు
  4. A.B. తూలిపుండృగొండ
  5. A.B. పడును