పుట:వెలుగోటివారి వంశావళి.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

వెలుగోటివారి వంశావళి


మల్కిభరామ[1] భూమండలేశ్వరునిఁ జెం
        డాడవె యవనకోలాహలాంక
మునుపుగా ముస్తఫా[2]ఖానుఁ బోఁ దోలవె[3]
        దండితో దానచింతామణీశ
ధాటిచేఁ జిట్టేలకోట మట్టించవె
        యెలమితో మన్నెభద్రేభమూర్తి
ధరయెల్ల నెఱుఁగంగ దస్తురఖానునిఁ
        జెండవె గండరగండబిరుద
పశుగణంబులఁ గొల్లపట్టించవే శౌర్య
        వైఖరి గాయగోవాళబిరుద
ముగురురాజులు మెచ్చ మగటిమిఁ జూపవె
        గడిదుర్గమునఁ బరాక్రమమృగేంద్ర
నీప్రతాపంబు మహిని వర్ణింప వశమె
సర్వబిరుదుల కొమరవేశ్యాభుజంగ
భళిర! వెలుగోటితిమ్మభూపతికుమార
మతిఫణీశ కుమారతిమ్మక్షితీశ.

258


సీ.

సిరులిచ్చి[4] కర్ణాటసింహాసనాధ్యక్షుఁ
        డాదరింపఁగ నెవ్వఁ డతిశయిల్లె
విఱిగినయని నుండు టెఱుఁగఁ డెవ్వఁడు కల
        నైన నేమఱుపాటుతోననైనఁ[5]
దురకమూకలఁ బాఱఁదోలె నెవ్వఁడు మహో
        గ్రాటోపమునఁ గొండవీటియొద్దఁ
దను భజించిన బంధుతతి నెల్లఁ దనయంత
        వారిఁగా నెవ్వఁడు ధరణిఁ బెనిచె

  1. B. మల్కిభూరామ
  2. A.B. ముస్తాఫ
  3. A.B. పారిగదగవె
  4. A.B. సిరులిచ్చు
  5. A.B. తోడనెన