పుట:వెలుగోటివారి వంశావళి.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

వెలుగోటివారి వంశావళి


ఖలవైరి[1] ధారుణీతలనాథమృదులాంగ
        తతులను[2] జక్కఁగాఁ దఱిగి తఱిగి
ముష్కరారాతిమస్తిష్కాస్థికర్పర
        కోటిఁ దుత్తుమురుగాఁ[3] గొట్టి కొట్టి
రూఢి నీఖడ్గసూపకారుఁడు రణోర్వి
వివిధభూతావళికి విందు వెట్టె నౌర
వెలయ వెలుగోటిపినకొండవిభుకుమార
భువనసుతశౌర్య పెదకొండభూపవర్య.

282


క.

ఆయన కూరిమి యనుజుఁడు
రాయనరాధిపుఁడు దానరాధేయుఁడు భూ
నాయకరత్నము కన్నడ
రాయార్పితరాజ్యసుఖనిరతుఁడై యొప్పెన్.

283


సీ.

సత్యభాషాసముజ్జ్వలుఁ డౌట సంఫుల్ల
        రాజీవనయనవిరాజి యగుట
నలఘుగోత్రధురీణుఁ డగుట నగణ్యకా
        రుణ్యదాక్షిణ్యనిరూఢుఁ డగుట
సంపూర్ణసత్త్వనిశ్చలుఁ డౌట సదనంత
        భోగివిహారవిస్ఫురితుఁ డగుట
నురుపుణ్యజనదుఁడై యుంటఁ గృష్ణావర
        జీవనసంగతిఁ జెన్నుగనుట
సిద్ధకృతవర్మరక్షణశీలుఁ డౌట
నాప్తమిత్రకృతాక్రూరుఁ డగుట విలసి
తాధికానకదుందుభి యగుట వెలసె
రాయనరపతి ఖడ్గనారాయణాఖ్య.

284


సీ.

కట్టించె లోకవిఖ్యాతంబుగా వారి
        వారణంబులు వారి వారణములు
నిలిపె నెల్లెడల నెన్నిక కెక్కఁగా భూమి
        సురగృహంబులు భూమి సురగృహములు

  1. A.B. ఘనవైరి
  2. A.B. తరలంబు
  3. A.B. మస్తిష్కహస్తికపాలకోటి తుత్తెనలుగా