పుట:వెలుగోటివారి వంశావళి.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

77


రంగముఖీలలామలను రాజ్యకవీంద్రతురంగసంపదల్
సంగతి నప్పనం బొసఁగి శైలములన్ విహరింతు రెప్పుడున్.

222


వ.

సంతతికి గుమారతిమ్మానేఁడు మొదలు.[1]

223


చ.

కుదురుగ మిమ్ముఁ గొల్చి[2] వెలుగోటి పురీంద్రకుమారతిమ్మ మేల్[3]
గదియఁగ[4] నగ్రహారములు గైకొనఁ జూతురు భూసురోత్తముల్
బెదరక మీకరాసి[5] హతిఁ బెల్కుఱి[6] వైరులు పోయి యూర్వశిన్
గదిసి కుచాగ్రహారములు గైకొనఁజూతు రదేమి చిత్రమో.

224


క.

ఘనుఁ డాకుమారతిమ్మన
కు నయార్ణవరాశి పెద్దకొండవిభుండున్
గనితిమ్మభూకళత్రుఁడు
పినకొండవిభుండు గల్గి పెంపొంది రిలన్.

225


వ.

అం దగ్రజుడు.

226


ఉ.

ధీవిభవుండు రాయవిభుతిమ్మధరాతలనాథు పెద్దకొం
డావనిభర్త మన్నియసురాధిపుఁడౌ నటుగాకయున్న సం
భావితలోకపాలన మభంగురభోగవిభూతి వజ్రభూ
షావృత[7]బాహుదండ మరయన్ నృపమాత్రుల కేల కల్గెడున్[8].

227


క.

ధరణిఁ బెదకొండభూవరు
వరతనయుఁడు తిరుపతీంద్రవర్యునకున్ శ్రీ[9]
వరుఁడును నరుఁడును మరుఁడును
సరియగుదురు నీలిచాపసౌందర్యములన్.

228
  1. A.B. తద్వంశోద్భవుండు కుమారతిమ్మ ప్రభుండు. But this would make Kumāra Timma a descendant of Gōpa of the preceding verse.
  2. V.V.C. p 83, కుదురుగ నాశ్రయించి
  3. V.P. Sastri, Cmm. 1 p 57, కొమార తిమ్మనిన్
  4. V.V.0289. గదియుచు
  5. B. కదాశి
  6. A.B. బెట్టిన; of V.P. Sastri (Cmm. 1. 57).
  7. A. లోకపాలిత... భూషాయత; B. లోకపాలిత... భూషాయత.
  8. A.B. కల్గునే
  9. A.B. వరుసయ్యవశుం