పుట:వెలుగోటివారి వంశావళి.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

వెలుగోటివారి వంశావళి


వ.

[ఆగనితిమ్మానాయని పరాక్రమం బెట్టి దనిన.[1]]

229


సీ.

చండరోషస్ఫూర్తి తొండమారయ గుళ్ల
        కోట నిరాఘాటధాటి గూల్చె
నచ్యుతదేవరాయలు రాయమన్నీల
        బొజుఁ గితండని సోటుఁ[2] బొగడ నెగడె
గడిఁ దాఁటిరాకుండ వడిఁ దాఁకి మలకకా
        ల్బలముల నేల కాల్బలముఁ జేసె
నెఱదిమ్ముఁ గొనసారి నెరదిమ్మ బిగఁ[3]బట్టి
        ఘటియించె గృధ్రకంకాలి[4]మ్రోలఁ
దోలి తొప్పరలాడి చేఁబ్రోలి[5] తిమ్మ
నృపుని వధియించె నాబాలవృద్ధముగను
సోమకులముఖ్య భార్గవరామభీమ
బిరుదములు మించఁ గనితిమ్మనరవరుండు.

230


సీ.

ఒకపారి కందవోల్ హోన్నప్పనాయనిఁ
        జెండవె కుచ్చెల చేనిమేర
వీరయశాంతభూవిభునిఁ దోలాడవె
        తలఁకి పాఱంగ[6] నుద్దండవృత్తి
నన్నూరియొద్ద నున్నతవిక్రమంబునఁ
        జాయని గెల్వవె జగము లెఱుఁగ
శాంతభూధవలింగ జనపాల గొట్టవె
        రాణ మీఱఁగఁ గృష్ణరాయ లెఱుఁగఁ
జేఁబ్రోలి[7] తిమ్మయఁ జెండి చెండాడవె
        చెలు వందఁగా మట్టచెఱువు నొద్ద

  1. A.B. తద్వంశోద్భవుండు. But this would suggest that గనితిమ్మ was a discendant of Tirupatēndra of the preceding verse.
  2. A. బోట B. బోటి
  3. A.B. బిగు
  4. A.B. ఘడ్పిచ్చ గ్రోధకంకాలి
  5. A.B. చాబోలి
  6. A.B. తరుప(వ) యినగు నుద్దండవృత్తి
  7. A.B. చేబోలి