పుట:వెలుగోటివారి వంశావళి.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

వెలుగోటివారి వంశావళి


క.

శ్రీవిభుఁడు నాదరించిన
నావిధమున భక్తితోడ నతిరమ్యముగన్
గైవల్య మేటి[1] కనుచును
సేవించుచు నున్నఁవాడు సింగయసుతుఁడున్[2].

217


క.

శ్రీకాంతుని నిజదాసుని
ప్రాకటముగు[3] సింగవిభుని రాయపజయమున్
శ్రీకరముగఁ గవిమల్లన
వెకుంఠారోహణంబు వరుస రచించెన్.

218


శా.

ఆరాయక్షితిపాలమాళికి విపక్షాద్రీంద్ర[4]దంభోళికిన్
శూరశ్రేష్ఠుఁడు సింగభూమివిభుఁడున్ సూకూరి[5] తిమ్మప్పయున్
సారోత్సాహి కుమారతిమ్మధరణీశక్రుండు[6] రంగప్పయున్
శ్రీరామేశచతుర్భుజంబు లన నర్థిం[7] బర్వి రత్యున్నతిన్.

219


[వ.

సంతతికి రంగపనేఁడు మొదలు][8].

220


గీ.

అతని పుత్రుండు[9] రంగక్షమాధిభర్త
చెలఁగి ఖడ్గంబు నిశ్రేణిఁ జేసినాఁడు
స్వర్గపురమున కరిగెడు శాత్రవులకు
మార్గణె కని రాఘాటమార్గమునను.

221


ఉ.

రంగపనేనియబ్బనృపరత్నము గోపనృపాలు ధాటికిన్
సంగరరం భూములను శాత్రవకోటులు నిల్వలేక సా

  1. A.B. మెచటి
  2. A.B. సింగయరాయడు
  3. A.B. ప్రాకటితగ
  4. A.B. వలిక్షాదీంద్ర
  5. V.V.C. p 82. A.B. నోకూరి
  6. A.B. పాలుండు
  7. A.B. నర్తిం
  8. In the place of this passage, సంతతికి కుమారతిమ్మానేఁడు మొదలు is found in the Mss; but the verses that follow describe the descendants of Rangapa.
  9. A.B. యనుజుండు