పుట:వెలుగోటివారి వంశావళి.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

75


కుశలంబెకా గాయగోవాళ నీకును[1],
        నోపరనారీసహోదరుండ,
పరిణామమే[2] నీకుఁ బద్మవంశపవిత్ర,
        పరమశ్రీవైష్ణవపారిజాత,
యనుచు సంతోషచిత్తుఁడై యభినుతించి
యిష్ట మెయ్యెది వేడుమీ యిత్తు ననిన
ఫాలమునఁ గేలు కీలించి ప్రస్తుతించి
రసికతను[3] బల్కె సింగయరాయవిభుఁడు.

213


ఉ.

సింగయరాయభూవిభుఁడు శ్రీహరిఁ జూచి నుతించి దేవ శ్రీ
రంగములోనఁ బూని ధనరాసులు విప్రుల కిచ్చి యాగముల్
సంగతిగా నొనర్చినను సద్గతి గల్గుట దుర్లభంబ యీ
సంగరభూమివంక మిము సందరిసింపను గల్లెఁ జాలదే.

214


క.

ఇల బ్రహ్మచర్య మాదిగ[4]
వలసిన యాశ్రమము లెల్ల వ్రతనిష్ఠలతో
సలిపిన పుణ్యులు నినుఁగనఁ[5]
గలుగుదురే నీదు[6] చరణకమలముఁ గంటిన్.

215


చ.

అనిన సరోజలోచనుఁడు నాదర మొప్పఁ[7] గటాక్షవీక్షలన్[8]
గనుఁగొని రాయభూరమణ, కాంచితి నిన్ను[9] సదానురక్తి నీ
వనయము నాదు సన్నిధిని నర్జునభీష్మవిభీషణాదిస
జ్జన[జన]పాల[10] భాగవతసంఘములోపల నుండు మెప్పుడున్.

216
  1. A.B. నీకునో
  2. A.B. పరిణామతో
  3. A.B. (న)శితను బెలికె
  4. A.B. మొదలుగ
  5. A.B. పుణ్యమున హితము
  6. A.B. కల(రె)దె మిము గాన
  7. A.B. యాదణించి
  8. A.B. కటాక్ష(లో)మేచనుఁ
  9. A.B. మిమ్ము
  10. A.B. సజ్జనపాల