పుట:వెలుగోటివారి వంశావళి.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

వెలుగోటివారి వంశావళి


క.

ధనమును బ్రాణము రెండును
దనరంగాఁ బాత్రములను[1] దాఁచిన వాఁడే
వినుమా సింగయరాయఁడు
చనఁగాఁ బొడగంటి మింత చాలదె మనకున్.

207


క.

అనవిని సింగయరాయఁడు
పనివిని వైకుంఠనగరిప్రాంతముఁ జేరెన్
ఘనసురమునియతి[2]నికరము
వినుతింపఁగ నర్థికోటి వేడ్కలఁ బొగడన్.

208


వ.

అప్పుడు.

209


చ.

రవిశతకోటితేజమున[3] రాజితమై తను వొప్పు[4]లక్ష్మితో
నవకముఁ దాల్చి[5] కౌస్తుభము నవ్యపదస్థితి మించుదేవునిన్
సవినయభక్తి గాంచి యటు సాగిలి దండము వెట్టి నిల్చినన్
దివిరిన వేడ్క మూలమగుదేవుఁడు రాయపఁ జూచి యిట్లనెన్.

210


ఉ.

ఈతఁడు నారదా, వినుమ యెంతయు మత్ప్రియుఁడౌ[6] జగంబునన్
ఈతఁడు నాదుదాసులకు నెచ్చినసేవ ఘటించు నెప్పుడున్
ఈతఁడు మామకస్మరణ నేమఱఁ డెన్నఁడు[7] భావవీథిలో
నీతఁడు మత్పురాణముల నెన్నుచు[8] మేలు ఘటించు నెప్పుడున్.

211


వ.

అనుచు నానాయకరత్నంబు నాలోకించి.

212


సీ.

వచ్చితే రేచర్లవంశపవిత్రుండ,
        సత్యవచోల్లాస, నిత్యయశుఁడ,
రావయ్య[9] ఖడ్గనారాయణబిరుదాంక,
        పరధనవర్జిత, పావనుండ,

  1. A.B. చోట
  2. A.B. యెతి
  3. A.B. మును
  4. A.B. వప్ప
  5. A.B. నవమముదాల్చు
  6. A.B. మప్రియుఁడై
  7. A.B. మాధవస్మరణ యేమరకెన్నడు
  8. A.B. నెన్నెటు
  9. A.B. రమ్యమా