పుట:వెలుగోటివారి వంశావళి.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

73


భూనుతంబుగఁ దమలోనఁ బొగడి రెలమి
రమణ నిట్లని సింగయరాయవిభుని.

203


ఉ.

పాయక శంఖచక్రములు బాహులఁ జెన్నుగంఁదాల్చి యాదినా
రాయణు ఠేవమున్[1] దివికి రాఁ గనుఁగొంటిమి రంభ, యెవ్వరే?
తోయజనేత్ర, యాజి భయదోషము నొందనివాఁడు ఖడ్గనా
రాయణుఁడైన సింగవిభురాయప విష్ణునిఁ గొల్వ వచ్చెనే.

204


మ.

అవుగా కే నిట నీదుపల్కునిజమో? యామాట తథ్యంబెకా
భువిలో నాజిని నీల్గువీరుల సదా భోగింపమా, క్రొత్తటే;
యవునే యూర్వశి[2], చూడఁ డన్యసతులన్ ఆవార్త ము న్వింటి మే
ధవళాక్షీ, వెలుగోటి రాయప మహాధర్మిష్ఠి ధీరుండటే.

205


సీ.

పరులు పెట్టిన వృత్తి పరనారివ్రతముగా
        జూచిన చూపుగాఁ[3] జూచినాఁడు
తాత పెట్టినవృత్తి ధరయెల్ల నెఱుఁగను
        తల్లిభావంబుగాఁ దలఁచినాఁడు
తండ్రి పెట్టినవృత్తి తబ్బిబ్బుసేయక[4]
        చెలియలిమాఱుగాఁ జేసినాఁడు
తాను బెట్టినవృత్తి తలఁపులో నెప్పుడు
        నాఁడుబిడ్డలరీతి నరసినాఁడు
ఆతఁ డిన్నిగుణంబుల[5] ననుసరించుఁ
జెలఁగి యెప్పుడు నాచార్యు సేవఁ జేయు
వసుధలోపల[6] సింగభూవరుసుతుండు
రాయనుతుఁడైన[7] వెలుగోటిరాయఘనుఁడు.

206
  1. B. డెవము
  2. B. యీశ్వరి
  3. A.B. జూచినయాచూపు
  4. A.B. తంబిచ్చుశాయక
  5. A.B. అతడు యిన్నిగుణంబుల
  6. A. వసుధలోన వెలయు, B. వసుధలో వెలయు
  7. B. రాయసుతుడైన