పుట:వెలుగోటివారి వంశావళి.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

వెలుగోటివారి వంశావళి


సీ.

నారదుం డాహరినామకీర్తన సేయ
        వ్యాసప్రహ్లాదులు[1] డాసి రాఁగ
వరుస విష్వక్సేన వాసుకుల్ పొగడంగ[2]
        జయవిజయాదులు సాగి[3] కొలువ
బన్నగాశనుఁడు వెంపార[4] ముందఱఁ జన
        నంజనాసూనుఁ డంతంత నడవ[5]
నింద్రాదిదేవత లెల్ల నుతింపంగ
        గంధర్వకిన్నరగాన మెసఁగ
సకలవైష్ణవసన్నాహసమితి చేరి
పరిణమింపంగ వైకుంఠపదముఁ గాంచెఁ
ద్రిజగముల వెల్గు[6] సంగ్రామదీక్షగురుఁడు
రాయభూపుఁడు[7] రెండవరాఘవుండు.

201


వ.

తదనంతరంబున.

202


సీ.

ఘనతరమందారకల్పకంబులనీడ
        గడువేడ్క విశ్రాంతి నడచి నడచి
ప్రాకారవిలసితప్రౌఢరత్నద్వార
        ములు సొచ్చి మదిలోనఁ జెలఁగి చెలగి
సురుచిర[8]మణిమయసోపానములకాంతి
        తఱచైన వీథుల మెఱసి మెఱసి
వైకుంఠసౌభాగ్యవైభవస్ఫురణలఁ
        జూచుచుఁ బలుమాఱు సొక్కి సొక్కి
వచ్చి వైకుంఠనగరంబుఁ జొచ్చి రాఁగ
దేవభామలు[9] స్వర్గము త్రోవ నిల్చి

  1. A. వ్యాసప్లంహ్లాదులు
  2. A. విష్వల్ త్సెనవానుడిగి ప్రముఖులు
  3. A.B. జయవిజయాదులు చేరికొలువ
  4. A.B. పన్నగశయనుడింపార
  5. A. అంజ్జనిసూరుడు అంద మొంద ; B. అంజనానూనుండు అందమొంద
  6. A.B. వెలయు
  7. A.B. భూవరుడు
  8. A.B. కమనీయ
  9. A. భామినులు B. భామునులు