పుట:వెలుగోటివారి వంశావళి.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

71


సీ.

రాక్షసావళి డాయు రామచంద్రుని ఠేవఁ
        గురుబలంబు నెదుర్చు[1] నరుని పగిది
భండనంబున నిల్చు భార్గవు భంగిని
        హాలాహలము జుఱ్ఱు[2] హరుని మాడ్కి
నురగేంద్రు వెనుకొను గరుడుని చాడ్పున
        నసహాయుఁ డగు[3] విక్రమార్కు పోల్కి
ధరను గేసరిఁ జూచు[4] శరభంబు రీతినిఁ
        గరితండములఁ గన్న హరి విధమున[5]
రణజయోత్సాహలక్షణరభస మెసఁగ
నిలిచె[6] మహనంది పడమట నిఖల మెఱుఁగ
వంశపావన రేచర్లవంశజుండు[7]
రాజతిలకుండు వెలుగోటి రాయఘనుఁడు.

197


వ.

అప్పుడు.

198


క.

పరిపంథికోటి విచ్చఁగఁ[8]
దఱుముచుఁ జెండాడి ఖడ్గధారావీథిన్
దురమున సింగయరాయం
డరిమిలి[9] జయలక్ష్మికాంత నాకర్షించెన్.

199


వ.

ఆసమయంబున.

200
  1. A. జూచు రామచంద్రుని బలంబుల కెదుర్చు
    B. జూచు రామచంద్రుని లేవ
  2. A. ఆలాహలము చెరునిచెరు
  3. A. అనపాయుడగు
  4. A. ధరకేసరిని
  5. A. హరియుభాతి
  6. A. నిలిచ; B. నివిచ
  7. A.B. వంశపావనుఁడు రేచర్లవంశజుండు
  8. A.B. లిచ్చగ
  9. A.B. రాయడు అరిమెను