పుట:వెలుగోటివారి వంశావళి.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

వెలుగోటివారి వంశావళి


మొనసి నీఖడ్గభేతాళముఖ్యులకును
విందు సేతురు సంగ్రామవీథులందు
[1][వేరు నీసాటి మన్నీలు విశ్వమునను?]
శత్రునిశ్శంక, వెలుగోటి శాసనాంక,
భాగ్యచారిత్ర, సింగభూపాలపుత్ర
మనుజవిబుధేంద్ర, పెదరాయ మండలేంద్ర.

194


సీ.

శ్రీహరి నత్తఱిఁ జిత్తాబ్దమున నుంచి
        మానంబుఁ జాఁదు[2]గా మేన నలఁది
తన సహాయంబుగా ధర్మంబు సమకట్టి
        కోపంబు చూపుల కొనలఁ దాల్చి
బిరుదును దెగువయుఁ బెనఁగొన సంధించి
        కరుణయుఁ దాల్మియుఁ గట్టిపెట్టి
ప్రతిపక్షధారుణీపతుల గుండె లగల్చి[3]
        లీలమైఁ గరవాలుఁ గేలఁబూని
యడుగు తడయకఁ[4] దడఁబడు నడుగు లిడక
తలఁపు చెదరనీయక లేఁకఁ[5] దలఁచుకొనక
తురగరేవంతచాతుర్యగరిమ మెఱసి
రణముఁ బొడఁగనె సింగయ రాయవిభుఁడు.

195


వ.

ఎటు[6]వలెను.

196
  1. A line is omitted.
  2. A.B. జాడు
  3. A.B. గుండెలు పగుల
  4. A.B. తడ బడక తడబడ
  5. A.B. చదరక లేక
  6. A.B. యిటు