పుట:వెలుగోటివారి వంశావళి.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

69


వేరు నీసాటి మన్నీలు విశ్వమునను?
శత్రునిశ్శంక, వెలుగోటి శాసనాంక,
భాగ్యచారిత్ర, సింగభూపాలపుత్ర
మనుజవిబుధేంద్ర, పెదరాయ మండలేంద్ర.

192


సీ.

ఎలమితో మాటపట్టిచ్చి నిల్పఁగలేని
        యల్పుల విటుఁడు నీయడపవాఁడు
పరదళంబులం గని భయమంది పాఱెడు
        కోఁచల బొజుఁగు నీగొడుగువాఁడు
కొలిచిన వారల కొలఁదెర్గి[1] నడవని
        లండీలవిటుఁడు నీగిండివాఁడు
అర్థుల నెల్లఁ గృతార్థులఁ జేయని
        కూళల బొజుఁగు నీకుంచెవాఁడు
వేరు నీసాటి మన్నీలు విశ్వమునను?
శత్రునిశ్శంక, వెలుగోటి శాసనాంక,
భాగ్యచారిత్ర, సింగభూపాలపుత్ర
మనుజవిబుధేంద్ర, పెదరాయ మండలేంద్ర.

193


సీ.

మద మహీనాథుల[2] మెదడు బోనము సేసి
        ప్రత్యర్థి దంతముల్ పప్పు సేసి
[3]యుగ్రాహితులగుండా లూరుఁగాయలు సేసి
        శత్రుబాహువులు పచ్చళులు[4] సేసి
యరిరాజరక్తంబు లానవాలుగఁ జేసి[5]
        నిష్ఠరాజుల క్రొవ్వు నేయి సేసి

  1. B. కొలదేరి
  2. B. మదేభాదుల
  3. This line is not found in B
  4. A. బాహులుపచ్చళ్లు
  5. B. రానీహముగ