పుట:వెలుగోటివారి వంశావళి.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

వెలుగోటివారి వంశావళి


వ.

ఆపినసింగమనేనికుమారుడు నిర్వాణరాయపనేని పరాక్రమం పెట్టిదనిన.

188


మ.

తలఁ పెల్లన్ హరిభక్తియుక్తి దినకృత్యం బెల్ల ధర్మక్రియల్[1]
నిలు వెల్లన్ దయకూప మెల్లయెడలన్ నిర్వర్గ మశ్రాంతమున్
గొలువెల్లన్ గవిగాయకావళి[2] పర[3]క్షోణీశ్వరుల్ సాటియే
వెలుగో టేచమశౌరి[4]సింగసకలోర్వీనాథరాయన్నకున్.

189


క.

వెలుగోటి కోటపై గొడు
గలవడఁ బట్టించుకొన్నయగ్గజపతి[5] దా
వెలుగోటిరాయవిభుఁ డన
నలఘుతరంబైన నామ మతనికి గలిగెన్.

190


గీ.

పాదుకొన్న యనావృష్టి పరిహరముగఁ
బ్రతిన వానలు గురియింప బ్రాహ్మణులకు
నగ్రహారంబు లొనరించె నడిగినట్లు
ధీయుతుండైన వెలుగోటిరాయఘనుఁడు.

191


సీ.

మాటాడితప్పెడు మన్నీఁడు మన్నీఁడె
        పాటిమాలిన లజ్జ బడుగు గాక
నమ్మించి చెఱిచెడు[6] నరపతి నరపతే
        గుఱిలేని[7] గుఱ్ఱాల గురువు గాక
రప్పించి చెఱిచెడు[8] రాజును రాజటె[9]
        మానంబు లేనట్టి మాల గాక
పలుకు సత్యము లేని ప్రభువును బ్రభువటె[10]
        ముక్కు సెవులు లేని మొఱ్ఱి గాక

  1. V.V.C. p. 80 దినకర్తవ్యంబులున్ ధర్మముల్
  2. V.V.C. p. 80 and V. P Sastri, (Cmm 1 p. 58) గాయకాళి
  3. A.B. దర, V.V.C. p. 80 యితరుల్; V P. Sastri. (Cmm p. 58) యితర
  4. V. P. Sastri. (Cmm p 58) వెలుగోట్యన్వయనారసింహ
  5. A.B. యెగ్గజపతి
  6. A.B. చెరిచేటి
  7. B గురులైన
  8. A.B. చేరిచేటి
  9. A.B. రాజుయే
  10. A.B. ప్రభువుయే