పుట:వెలుగోటివారి వంశావళి.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

67


వ.

ఆమాదానేనికి నెఱసూరానేఁడును[1] నలసూరానేఁడును[2] గలిగిరి. నలసూరా
నేనిసంతతివారు సూరానేనివారైరి.[3] ఎఱసూరానేనికి నేచమనేఁ
డును[4] మాదానేఁడును[5] గలిగిరి; మాదానేనిసంతతి పోలూరివారును[6],
నేచమనేనిసంతతివారు వెలుగోటివారును[7][నైరి]. ఆయేచమనేనివంశావ
తారం బెట్టి దనిన.

188


క.

ఆయెఱసూరపకును గరు
ణాయనుఁడు విరోధిభూధరార్పితవివిధో
పాయనుఁడు పుట్టె నేచమ
నాయఁడు కవిసవిధ[8]కల్పనగము ధరిత్రిన్.

184


ఉ.

[9]శ్రీలలరంగఁ బాండ్యగజసింహుఁడు గానఁ జలంబుపెంపునన్
లాలితపట్టభూషణతలాటము సూరనరేంద్రు[10] నేచఁడున్[11]
ఆలములోన నశ్వమున కాదటఁ బెట్టినఁ బెట్టుఁగాక యే
జాలియు మాలి యాబిరుదు[12] చయ్యన నన్యులు పెట్ట శక్యమే.

185


వ.

అతనికుమారుండు.

186


ఉ.

సంగరసవ్యసాచి[13] దృఢసత్యధురంధరుఁ డేచభూమి భృ
త్పుంగవునందు[14] భూభువనభూషితభూరిగుణాంబురాశియై
సింగన సంభవించె నతిచిత్రము దాని నెఱింగి వైరిమా
తంగము లేఁగి కొల్చె సతతంబును మన్నెమెకంబు లన్నియున్.

187
  1. న్న
  2. న్న
  3. వారున్ను
  4. న్న
  5. న్న
  6. న్న
  7. న్న
  8. A.B. కవినవిధ
  9. This short prose passage అతని కుమారుండు seems to have been wrongly inserted here by the scribe.
  10. A.B. సూనరరే
  11. V.V.C p. 75 substitutes మాధవుం | డా
  12. A. మాలియంబిరుదు; B. మాలియుం
  13. A. సారససవ్యసాచి
  14. A. భూ | పుంగవునందు