పుట:వెలుగోటివారి వంశావళి.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

వెలుగోటివారి వంశావళి


సీ.

కట్టునో పట్టునో కామధేనువు దాను[1]
        చూఁడిదో పాఁడిదో చూడరాదు
కాచునో కావదో[2] కాక వేలుపుఁజెట్టు
        ఎండునో పండునో యేటిఫలము
చిక్కునో తక్కునో చింతామణిశ్రేణి
        త్రవ్వమో[3] రువ్వమో రాళ్లతోడ
మెఱచునో పఱచునో మేఘుఁ డొక్కొకచోటఁ
        దేలునో వాలునో తెలియరాదు
అనుచుఁ దమలోనఁ దలపోసి రర్థివరులు
ఈగి నీతోడ నితరుల నెన్న లేక
రాజనిర్భంగ రణరంగరాఘవేంద్ర,
రావుచిటిదాచభూపాల రసికలోల.

178


వ.

తద్వంశోద్భవుండు.

179


ఉ.

అక్కరొ, తోడి తెమ్ము సుగుణాకరు[4] దాచయయన్నవోతు; నే
మ్రొక్కక కాని రాఁ డెటులు మ్రొక్కుదు రాజులు వానియందియన్
గ్రిక్కిఱుచున్నవార లదె[5] కీడ్వడి మ్రొక్కిన యాలతాంగికిన్
అక్కట! మానహాని యగు నంతకుఁ జాలిన జాలు మ్రొక్కెదన్.

180


వ.

అనపోతానేనికి మాదానేఁడు పుట్టెను.

181


ఉ.

దాచయయన్నవోతవసుధావరుమాదయునాయకేంద్ర, నీ
వేచిన[6] రాయరావు బిరు దెక్కువగా రిపులైనయట్టి యా
రాచకుమారవర్గముల రాసి యురంబుల డాగు లొత్తినన్[7]
జూచినవారు నిన్ దరియఁ జూడరు[8] నీబిరుదప్రసిద్ధికిన్.

182
  1. A.B. ధేనువవదా
  2. A.B. కాయదో
  3. A.B. రవ్వమో
  4. B. అక్కెటెతోడి తెమ్మనుగుణాకరు
  5. A.B. వారుయిదె
  6. V.V.C p 74 మాదవనాయకుండు తా నేచిన
  7. V.V.C p 74 రాచధరాధినాథులయుగంబుల డాగులనొత్తగా నెదల్
  8. A. B. చూచినవారు నిం తునులి చూడరు. V.V.C. p 74 చూచిస్పృశింప రయ్యరుల సుందరులా