పుట:వెలుగోటివారి వంశావళి.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

65


ఒత్తిన[1] సప్తవాయువులు తిత్తులగాడ్పు
        భుజగాధినాథుండు బొగ్గుఁబ్రోవు
నిటలాక్షుడమరు వార్భట[2]మైన సంబెట
        డంబైన కాలకూటంబు పదను
మిహిరబింబంబు నిద్దంపు[3]మెఱుఁగుసాన
వీరభద్రుండు నెఱవాదికారుకుండు[4]
సృష్టిమించిన నీఖడ్గసృష్టి నౌర
రాజసము కొమ్మ మేదినీరావుతిమ్మ.

178


ఉ.

ఈతఁడు గూర్జరాధిపతి యీవలివారలు చోళపాండియుల్
ఆతల నంతె భూపతుల[5] టావల సోమకులేశు లంచు వి
ఖ్యాతుల[6] రావుధర్మనివరాత్మజు[7] తిమ్మనియందెరాజులన్
జేతులఁ జూపి చెప్పుదురు చేడెలు పాదము లొత్తు నత్తఱిన్.

174


వ.

ఈతిమ్మానేనికి ధర్మానేఁడును[8] చిటిదాచనేఁడును[9] గలిగిరి. అందగ్రజుండు.

175


క.

కారాకు డుల్లి తరువులు
మారాకులు పెట్టుఁగాక మాటికి మగుడన్[10]
మారాకు పెట్టఁ జెట్టా
ధారుణి పతి కేల రావుధర్మనృపాలా.

176


వ.

ధర్మానేనిసంతతి రావువారు.

177
  1. A. వొత్తుఅన; B. వొత్తున
  2. A. నిటలాక్షుడమరుగార్భటమైన
  3. A. యిద్దుర
  4. A. కారకుండు
  5. V V.C. p 71. చోళపాండ్య భూ | నేతలు వారు వింధ్యధరణీపతు
    లావల సోమవంశవి|ఖ్యాతులు నంచు
  6. A. సోమకులేశలయ్నివిఖ్యాతులు; B. సోమకులేశు లయ్యి విఖ్యాతులు
  7. V V.C. p. 71. రావుధర్మనృపునాత్మజు
  8. V V.C. p. 71. న్ను
  9. V V.C. p. 71. న్ను
  10. A. మెగుడన్