పుట:వెలుగోటివారి వంశావళి.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

వెలుగోటివారి వంశావళి


చ.

పొలుపుగ రాయరావు ననవోతయధర్మకుమారచంద్ర నీ
చెలువపు వామపాదమునఁ జెల్వు వహించినయందె మ్రోఁత[1] దా
ఘలుఘలు ఘల్లుఘల్లు మనఁ గంపిలు రాజుల గుండె లన్నియున్
ఝలుఝలు ఝల్లుఝల్లు మని చల్లిక గుబ్బటిలంగ[2] నెప్పుడున్.

170


వ.

అతని కుమారుండు.

171


సీ.

సోమకులంబు రాజుల నీవు సాధింప
        శంకఁ జంద్రుం డొకవంకవోయె[3]
హేమాద్రిదానచింతామణి వని మ్రోఁగఁ[4]
        గనకాద్రి యొకవంకఁ గదలకుండె
గజదళసంహారవిజయంబు గైకొన్న
        గజిబిజి మాని దిగ్గజము లొదిఁగె[5]
రూపనారాయణరూఢి నీ వెచ్చిన
        హరి నరసింహత్వ మాచరించె
నీకు నేరాజు లీడు వివేకచరిత
కలితమూవరురాయర[6]గండబిరుద
భవ్యచారిత్ర ధర్మభూపాలపుత్ర
రాయరావైన మేదిని రావుతిమ్మ[7].

179


సీ.

నారసింహస్తంభసారంబు లోహంబు
        బడబానలజ్వాల పాదుకొల్మి[8]
మందరశైలంబు మానైనదాకఁలి
        బలురాహుదంష్ట్రలు పట్టుకార్లు

  1. A.B. మోత
  2. A.B. గుబ్బగలంగె
  3. A.B. వంకనోర (వంక)నో, యె
  4. A.B. మోగి
  5. A. లొదవె; B. మెదలె
  6. A.B. గలిగినముగురురాయరగండబిరుద
  7. A. రాయతిమ్మ, B. రాయరావుతిమ్మ
  8. A. కొల్చి