పుట:వెలుగోటివారి వంశావళి.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

63


పెక్కిన కామధేనువు శిబీంద్రుల నెన్నెదు భట్ట దిట్టవై[1]
కుక్కవొ నక్కవో ఫణివొ క్రోఁతివొ పిల్లివొ బూతపిల్లివో.

163


ఉ.

ఇమ్మహి రావుసింగమనుజేంద్రవసంతుని[2] యీవు లెన్నుచోఁ
గ్రమ్మి దధీచిభానుసుతకల్పకమేఘులఁ జెప్పనేల యా
బొమ్మిక వెట్టులాటలును బూని కళాసపు మొత్తులాటలున్
దుమ్ములచల్లులాటలును దూకొని నీళుల చల్లులాటలున్.

164


వ.

అతనియనుజుండు.

165


క.

భ ట్టనఁగ రుద్రరూపము
భ ట్టనఁగా రాచవేల్పు పాటించనియా
తొట్టరిరాజుల కబ్బునె[3]
రట్టడి సత్కీర్తికాంత రావువసంతా.

166


చ.

నడవడి చక్కగాద యొకనాఁడును[4] బుక్కిటఁ జేదుమాన దే
ర్పడ వినఁ జెప్ప లేదు పెనుబండువునందును గాలి ద్రావు నీ
బడుగును నేల పొంద నని పాసి వెసం[5] జను దెంచి కాదె యీ
పుడమి వరించె వేడ్క నృపపుంగవు రావువసంత రాయనిన్.

167


వ.

సంతతికి ధర్మానేఁడు మొదలు.

168


చ.

కదనమె బొమ్మరిల్లు చెలికత్తెలె వీరజయాంగనామణుల్
మదకరిమస్తకుంభములు మాటికి దొంతులు[6] సంగరస్థలిన్
గుదికొని పడ్డ రాహుతుల[7] క్రోవులు గుజ్జనగూళ్లు బాపురే
పొదలెడు[8] రాయరావు ననపోతయ ధర్మని ఖడ్గపుత్రికన్.

169
  1. A.B. నెన్నెడు భట్టదిట్టడై
  2. A.B. వనంతములీవు లెన్నుచో
  3. A.B. కబునె
  4. A.B. నడవడి చక్క గాదు(వొ)నొకనాడును, cf V. P. Sastri, Sr Sr, App. p. 5.
  5. V.V.C. p 70 ఫణిన్
  6. A. దొత్తులు
  7. B. రాహువుల
  8. A.B. పొదలుచు