పుట:వెలుగోటివారి వంశావళి.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

వెలుగోటివారి వంశావళి


బగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి[1]
        గౌడడిండిమభట్టు కంచుఢక్క
చంద్రభూషక్రియాశక్తి రాయలయొద్దఁ
        బాదుకొల్పితి సార్వభౌమబిరుదు
ఇంతకాలంబువలెఁ గాదు వింతరీతి
నెట్లు మెప్పించెదో కదా యింకమీఁద
రావుసింగాంకభూపాలు ధీవిశాలు
సకలసద్గుణనికురంబ శారదాంబ.

160


సీ.

ఏ మిచ్చెరా యోరి యెమ్ము లిచ్చె దధీచి[2]
        యెమ్ము లర్థులకుఁ దా సొమ్ము లగునె
మహిమ చెప్పెద వోరి[3] మాంస మిచ్చెను శిబి
        కండ లర్థులకు బంగార మగునె
జీమూతవాహనుం డే మిచ్చెరా యోరి
        యడిగినఁ బ్రాణముల్ విడిచె నపుడు
కర్ణునిత్యాగంబు వర్ణించెదవు భట్ట
        వర్మ మర్థికి పట్టువల్వ యగునె[4]
పూని యవి చెప్పఁ జూపఁగా రాని యీవు[5]
లెన్నఁడో నాఁటి వార్తల కేమి చెప్పఁ
బ్రథనవిజయుండు ఖడ్గనారాయణుండె
యిచ్చుఁ గవులకు సింగభూమిశ్వరుండు.

161


వ.

సర్వజ్ఞసింగమనేఁడు శ్రీనాథునకు సమస్య యిచ్చిన పద్యము.

168


ఉ.

తక్కక రావుసింగవసుధావరుఁ[6] డర్థుల కిచ్చుచున్నచో[7]
దిక్కులలేని కర్ణుని దధీచిని ఖేచరు వేల్పుమ్రాఁకుఁ బెం

  1. A.B. దుర్భటవివాహవ్రహుడినవు(మ)ర
  2. A.B. తనయమ్ములిచ్చెదంచు
  3. A.B. చేశదవోరి
  4. A.B. వర్మ మర్థులకు పట్టుశాల(ల్వ) లగునె; V.P. Sastri Sr. Sr. App. p 5
    చర్మ మర్థికి పట్టుసాలువగునె
  5. A.B. పూనియ(క)వి చెప్పచూపరానియీవు; V.P. Sastri, Sr. Sr. App p. 5.
    పూనికలిఁ జెప్పఁజూపఁగా రానియీవు
  6. A.B. ధరణీశ్వరుఁడు
  7. A.B. అర్ధులకిచ్చునన్నచో; V.P. Sastri. Sr. Sr. p. 196 అర్థుల కర్థ మిచ్చుచో