పుట:వెలుగోటివారి వంశావళి.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

61


వాసికెక్కిన రేచర్లవంశవార్ధి
శీతకరుఁడగు రేచర్ల సింగవిభుఁడు.

157


సీ.

రాధేయుదానంబు ప్రాభవం బంటిమా
        యూడునో యూడదో యాడరాదు[1]
సురభూజములవార్త సొబగు పొమ్మంటిమా[2]
        యెండునో పండునో యెఱుఁగరాదు
జలదంబు[3] చాగంబు చర్చింత[4] మంటిమా
        మెఱచునో పఱచునో[5] మెచ్చరాదు
కామధేనువునీగి[6] గణుతింత మంటిమా[7]
        కట్టునో వట్టునో[8] కానరాదు
తోలు చూపక యుడివోక తూలిపోక
కొమ్ము గ్రువ్వక[9] కయికొండు కోర్కు లనుచుఁ
బ్రథనవిజయుండు ఖడ్గనారాయణుండు
ఇచ్చుఁ గవులకు సింగభూమీశ్వరుండు.

158


వ.

శ్రీనాథుఁడు సర్వజ్ఞునిసముఖమునకుఁ[10] బోవుచు శారదాంబను బ్రార్థన
చేసిన పద్యము.

159


సీ.

దీనారటంకాలఁ దీర్థమాడించితి
        దక్షిణాధీశు ముత్యాలశాలఁ
బలుకుతోడై తాంధ్రభాషామహాకావ్య
        నైషధగ్రంథసందర్భమునను

  1. A. పూంటలోదాటమోమారాదు; B. పూటలోదాటిలోవూరాదు
  2. A.B. వోమ్మట్టిమా
  3. A.B. జలజంబు
  4. A.B. చర్చింతదంటిమా
  5. A.B. మెరచునో వరచునో
  6. A.B. కావదినువయీగి
  7. A.B. గణుతించదంటిమా
  8. A.B. పట్టువో
  9. A.B. తోలుచూపక పుడిబొకతూ(లి)డివోక(కొ)మెమ్ములె(ంప్ప)వ్వక
  10. A.B. సమఖానకు