పుట:వెలుగోటివారి వంశావళి.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

వెలుగోటివారి వంశావళి


సీ.

[1][పటుసోమకులరాజపరశురామాంకుఁడై
        సమ్మెటసోమునిఁ జక్కఁ జేసె
ఖడ్గనారాయణగాయగోవాళుఁడై
        సరిపల్లెరాజుల సంహరించె
బట్టుతలాటాంకబల్లరగండఁడై
        యనవేమరెడ్డిని నాజి దునిమె
జగమందు రాయవేశ్యాభుజంగాంకుఁడై
        సురథానిబలముల సొరిది గెలిచె
ధరణి నాతఁడు భీమప్రతాపవిజయ
బాహుబలశాలి నిత్యసౌభాగ్యశీలి
లలితసుగుణుండు రేచర్లకులపవిత్రుఁ
డనఁగ వెలసెను సింగయ[2]యన్నవిభుఁడు.]

155


వ.

ఆయనవోతమనేనికి సర్వజ్ఞసింగమనేఁడును[3] వసంతరాయఁడును బుట్టిరి.
అం దగ్రజుండు.

156


సీ.

సకలవిద్యాభ్యాససాహసగరిమంబు
        సూటి మీఱఁగఁ దోడు సూపినాఁడు
కఠినశాత్రవయూధఘనకంఠరక్తంబు
        వేడ్కఁ గాళికి భుక్తి వెట్టినాఁడు
సాధుమార్గక్రియాసౌజన్యమున నీతి
        చెలఁగ సద్వర్తనల్ చేసినాఁడు[4]
సంతతార్థివ్రాతసముదయంబులతోడ
        వెలయ బాంధవము గావించినాఁడు
అతఁడు భూపాలమాత్రుఁడే చతురవిభవ
విజితజంభారి[5] సర్వజ్ఞవిగ్రహంబు

  1. This verse is not found in the Velugōtivāri vamśāvaļi, but is quoted both in V.V.C and R.V.C.
  2. V.V.C p 68, R.V.C p 12 పినసింగ
  3. A.B. న్ను
  4. A.B. తతహేతిచలగి వర్తనలుగా జేసినాడు
  5. A.B. వితతజంభారి