పుట:వెలుగోటివారి వంశావళి.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

59


జండభుజదండఖండితసకలవైరి
మండలేశ్వరనుత వైరిపుండరీక
పరిమళాపూర్ణదిగ్దంతిజలవిహార
యహితనిర్ఘాత రాయరావన్నపోత.

151


క.

ఒకమెతుకున నొకనాఁకలి
ప్రకటితముగఁ దీర్పరాదు పదివేవుర నీ
వొకమెతుకున రక్షింతువు
అకలంకా రాయరావు అనపోతాంకా.

152


క.

సమ్మెటసోముని సరెపలి[1]
తిమ్మని నలకొండవీటిదిక్కున మెఱయన్
దమ్మటము వేసి గెలిచితి
వమ్మక్కా రాయరావు అనపోతాంకా.

153


సీ.

పౌరుషంబున నీవు పానగల్లాదిగాఁ
        గోటరాజ్యంబెల్లఁ గొల్లలాడి
యేపుమై రాజమహేంద్రంబు మేరగా
        రెడ్డిరాజ్యంబెల్ల రేగఁ గొట్టి
బాహుబల్మినిఁ జెన్నపట్ణంబు మేరగాఁ
        దిగుటురాజ్యంబెల్ల దెబ్బఁ దీసి
మొక్కలంబునఁ[2] జొచ్చి ముద్దోగి[3] గీటుగ
        బోయరాజ్యంబెల్లఁ బొడిచివైచి
నేర్పు నెఱపించి[4] రాయల నిగ్రహించి[5]
యట్లు సంబెట్ల గెలిచితి వాహవమున
విమలచారిత్ర సింగభూవిభుసుపుత్ర
వర్ణితాటోప[6] రాయరావన్నపోత.

154
  1. B. నరెపలి
  2. R.V.C. p123. A.B. మొక్కరంబున
  3. R.V.C. p123. ముద్దోజి
  4. R.V.C. p123. నెలపించి. A.B. నేర్చున రప్పించి
  5. A.B. నిర్వహించి
  6. B. ఘోర, R.V.C. p. 123