పుట:వెలుగోటివారి వంశావళి.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

వెలుగోటివారి వంశావళి


ఆదిగర్భేశ్వరుం డనపోతభూపతి
        తర్కింప నేరాజు తాతతండ్రి[1]
చిరకీర్తి యగురావు సింగావనీశుండు
        గట్టింప నేరాజు తండ్రితండ్రి
బిరుదభీకరుడైన పినసింగనరపతి
        చెన్నొంద నేరాజు గన్నతండ్రి
శూరుఁ డారాజదైతేయశోషణుండు[2]
సారసస్వాంతసేవావిశాలుఁడైన[3]
యన్నమాంబాతనూజాతుఁ డనఘమూర్తి
రాయరావన్నవోతధరాధిపుండు[4].

149


ఉ.

మేదినిరాయరా వనెడు[5] మేటి మహాబిరుదప్రతాపసం
పాదన మన్నపోతజనపాలుఁడు సేసినఁ జెల్లుఁగాక యీ
పాదలి మన్నెబందల[6] కపాత్రపురాజుల కేల గల్గుఁ దా
నాదటఁ[7] దాండవంబు శివుఁ డాడిన జోగుల కాడఁ జెల్లునే.

150


సీ.

ఛప్పన్నరాజన్యసంగరస్థలిలోన
        వాఁడె రా జుని కానవచ్చు నిన్ను
బిరుదనూపురరాజభీకరస్థలిలోన
        వాఁడె రా జని కానవచ్చు నిన్నుఁ
బరభేదనాటోపపట్టభద్రులలోన
        వాఁడె రా జని కానవచ్చు నిన్ను
సర్వసర్వంసహాచక్రవర్తులలోన
        వాఁడె రా జని కానవచ్చు నిన్ను

  1. A. తండ్రి తండ్రి ; but the word తాత is transcribed over the line above the first తండ్రి by the scribe.
    B. తాత తండ్రి
  2. A.B. నవుదనాంశ్రీ
  3. A.B. దిశాలుఁడైన
  4. A.B. ధరావిభుండు
  5. A.B. రావుయను
  6. A.B. పాదరి మంన్యబదలకు
  7. A.B. నే ఆదల