పుట:వెలుగోటివారి వంశావళి.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

47


క.

పుడమిని నాకాశంబునఁ
బిడుగు కరణి రావుసింగ[1] పృథ్వీశుఁడు దాఁ
బొడుపొడు మని వెను దగిలిన
వెడవెడ జగనొబ్బగండ వేముఁడు పాఱెన్.

145


వ.

ఆపెదసింగమనేనికిఁ బినసింగమనేఁడును[2] నన్నమనేఁడును[3] గలిగిరి. ఆయన్న
మనేఁడే యారుకచేను బయట గండికోటకు ముట్టడిగా దిగఁగఁ[4], బోలెపల్లి
బుక్కరాజు రాత్రియుద్ధంబున నన్నమనేనిఁ జంపఁగ[5] నతనితమ్ముఁడు[6] సింగ
మనేఁడు దనమఱఁదిఁ జూపల్లికొండభూపాలుని నప్పనవెట్టిన[7] [నాతఁడు]
కరవాలభైరవ, గండభేరుడ, సంగడిరక్షపాలక[8] దక్షిణదోర్దండమండితం
బైన సేనఁ గల మేటిగాన నాబుక్కరాజు పొడచేటికోటఁ జొచ్చినఁ, గోట
యెక్కి బుక్కరాజున కభయం బిచ్చి తెచ్చెను జూపల్లికొండసుజనఘనుఁడు.

146


క.

ధాటిం బొడచే డెక్కితి
హాటకముగ బుక్కరాజు కభయమొసఁగి తా[9]
మేటి విభీషుణునకువలె
సూటిగ నీజయము నిండఁ జూపలికొండా.

147


వ.

ఆపినసింగమనేని వంశావతారం బెట్టిదనిన.

148


సీ.

వీరాగ్రగణ్యుండు వెన్నభూపాలుండు
        ఖ్యాతి నేరాజు ముత్తాతతాత
నెఱిపాండ్యగజసింహుఁ డెఱదాచభూపతి
        ధాత్రి నేరాజు ముత్తాతతండ్రి
సంగరాభంగుండు సింగభూనాథుండు
        తనరంగ నేరాజు తాతతాత

  1. A.B. పిడుగుదనుదారావుశింగ
  2. A.B. న్ను
  3. A.B. అన్నమనేఁడు
  4. A.B. దిగితే
  5. A.B. జంపితె
  6. A.B. ‘తమ్ముఁడు' అనుట తప్పు; ‘అన్న' యనుట యొప్పు అని తోఁచుచున్నది
  7. A.B. వప్పు పెట్టిన
  8. A.B. నంగడిరక్షపాలక
  9. A.B. కభయంబిచ్చితి