పుట:వెలుగోటివారి వంశావళి.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

వెలుగోటివారి వంశావళి


లోకమున రాజు లౌలాక లోక గాండ్లు(?)[1]
యొరయఁ జూతురు బిరుదుకై యోర్వలేక
లాలితంబగు సింహతలాటమునకు
రాజహృద్భంగ త్రిభువనీరావుసింగ.

140


ఉ.

పాలితకీర్తి సోమకుల భార్గవరాముఁడు రావుసింగభూ
పాలుఁడు సోమవంశ నరపాలురఁ గొట్టి వధింప సోముఁ డా
శైలము లెక్కి క్రుమ్మఱియు[2] శంకరుజూటముఁ జొచ్చి వచ్చి పా
తాళముఁ దూఱి యబ్ధి బడి ధాటికి నోర్వక పోయె మింటికిన్[3].

141


క.

సోమకులపరశురాముఁడు
భూమీశుఁడు రావుసింగపుడమీశుఁడు దా
సోమకుల మెల్లఁ జంపఁగ
సోముఁడు భయమంది శివునిజూటముఁ జొచ్చెన్.

142


శా.

ఏమీ శేషుఁడ, యేమి నారద, ముదం బేపారునా? తొంటి వి
శ్రామం బేమియు లే ద దేమి? మహి మీఱన్[4] రావుసింగాంకుఁ డు
ద్దామప్రౌఢిమఁ దోల[5] సోమకుల గోత్రాధీశ్వరుల్ జోగులై
భామల్ దామును బాముల న్వెదకఁగాఁ బాతాళమున్ దూఱితిన్.

143


ఉ.

భైరవుకుక్క[6] బందుగుల[7] బాఁతి కుమాళ్లను గన్నతల్లి నీ
పేరు ప్రసిద్ధిగాఁగ మును పెద్దలచే విని చూడవచ్చితేఁ[8]
గోరెడు బోనమున్ గుడుముఁ గూరయుఁ[9] బెట్టు మటంచు జోగికై
వారము లాడుచున్ దఱచు వత్తురు రావునృసింహ నీరిపుల్.

144
  1. A. లోకమునరాజు లౌలాక లోకనగాండ్లు
    B. లోకమునరాజు లౌలాక లోకగాండ్లు
  2. A.B. క్రమ్మరియు
  3. V.V.C. (p 61) has an additional line
    కం| చాలములోన నీదురిపు లాడుదు రెంతయు సింగభూపతీ.
  4. V.P.Sastri Cmm 1 p 57; A.B. లేదు యదెమీత్రిభువనిరావు శింగాంకుడు.
  5. V.P.Sastri Cmm 1 p 57; A.B. జయింప
  6. A.B. భైరవకుక్క
  7. A.B. బండుగుల
  8. A.B. వస్తినే
  9. A.B. కూరయ