పుట:వెలుగోటివారి వంశావళి.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

55


యొరసి యెరయ లేక యొరయుచు[1] వాహ్యాలి[2]
        మెండొడ్డురాజుల మిండగీడ[3]
తారసించిన చోటఁ దారసించగలేక
        ఱంపిల్లు రాజుల ఱంకుబొజుఁగ
యొగిలేనిబిరుదుల వొగడించుకొని చాల
        నిక్కెడురాజుల[4] ముక్కుఁగొయ్య


గీ.

యొరయ నీతోడ బిరుదుకై యొరయ[5]వెఱచి
గజపతికిఁ గొండెముల్ చెప్పి కఱకఱించు
జూటుకూటువ[6]రాజుల చుక్కవాల
రాజహృద్భంగ త్రిభువనీరావుసింగ.

139


సీ.

కులము చాలని రాచగూటిడ(?)దుడ్డెలు
        (?)బోటి కోతుల రాచబోగుబడులు[7]
పట్టఁగ బతిమాలు నట్టి రాచకుమాళ్లు
        పూరిపిట్టలు రాచబుడిదవిళ్లు[8]
సి గ్గెఱుంగనిరాచచివురులు గునిసెలు
        గూబచంకల రాచకొంకుగాండ్రు[9]
దడ మెఱుంగని రాచతాటవేటనిగాండ్లు
        ద్రోహబుద్ధులు రాచదుడుకుగాండ్లు[10]

  1. A.B. వొరశియగ లేక వొరయుచు
  2. B దాహ్యాలి
  3. A.B. మిండ గీడు
  4. A.B. మెరసి నిక్కెడురాజుల
  5. A.B. వరసి నీతోడ బిరుదుకై వరయ వెరచి
  6. A.B. న(స)నగూటు
  7. A.B. బోటికాంతలరాచబోగిబల్లు
  8. A.B. పట్టువడి....బురికిపిట్టలు రాచబుడిదవెళ్లు
  9. A.B. సిగ్గెరంగనిరాచ చివు(కు)రులు గునిశెలు గూబజంకల రాచ కొంకగాళ్లు
  10. A.B. దాళపెరుగనిరాచ తాటవెట్నగాండ్లు ద్రోహబుద్ధులు రాచదుటుకుగాండ్లు