పుట:వెలుగోటివారి వంశావళి.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

వెలుగోటివారి వంశావళి


వహించెను. ఆలింగమనేనికిఁ బర్వతనాయఁడును[1] నతనికిఁ గుమారలింగమ
నేఁడును[2] గలిగిరి.

131


వ.

సంతతికి ననపోతక్ష్మాపాలుండు మొదలు.

132


క.

అందు ననపోతవిభునకుఁ
బొందుగఁ బెదసింగవర్య భూమీశుండున్[3]
గందర్పరూపరేఖా
వందితుఁ డగు ధర్మవిభుఁడు వరుస జనించెన్[4].

133


వ.

అందగ్రజుండు.

134


ఉ.

సోమకులంబు రాజులను శూరత మించిన రెడ్డిరాజులన్
సామజనాథు కొల్వునను సారెకుఁ గొండెము పల్కురాజులన్
వేమఱు రావుసింగధరణీశ్వరుఁ డందియఁ బెట్టి యుండఁగా[5]
భామలు వ్రేళ్లఁ జూపుదురు పాదము లొత్తుచు వారివారికిన్.

135


వ.

అతని యనుజుండు.

136


చ.

కదనమె బొమ్మరిల్లు చెలికత్తెలె వీరజయాంగనామణుల్
మదకరి మస్తకుంభములు మాటికి దొంతులు సంగరస్థలిన్
గుదికొని వడ్డ[6]రాహుతుల క్రోవులు గుజ్జనకూళ్లు బాపురే
పొదలెడు రాయరావు ననపోతయధర్మని ఖడ్గపుత్రికన్.

137


వ.

మఱియుఁ[7] బెదసింగమనేని పరాక్రమం బెట్టిదనిన.

138


సీ.

నూనూఁగుమీసాల నులిచి హుంకారించి[8]
        కపటించు బహురాచగములగొంగ[9]

  1. A.B. న్ను
  2. A.B. లింగమనేడు గల్గిరి
  3. A.B. భూవరముఖ్యుండు
  4. A. జనించిరి
  5. A.B. యున్నగా
  6. B. పండ్డ
  7. A.B. మరిన్ని
  8. A.B. హుంకారించు
  9. A. చాపు: B. మాపు