పుట:వెలుగోటివారి వంశావళి.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

53


ఉ.

ఆర్గురుచక్రవర్తులు పదార్గురురాజులు దక్క నన్యరా
డ్వర్గము నీసమాన మనవచ్చునె బాహుపరాక్రమక్రియా
భర్గసమాన[1] సోమకులభార్గవరామ కొమారలింగ స
న్మార్గపరంపరాభిమతమంగళమూర్తి విశాలకీర్తులన్.

127


సీ.

హెమ్మాడదేవునికి నేపారఁ జూటూరి
        సూరునిఁ బాశము ధారుణీశు
గోవర్ధనుని సోమదేవభూవల్లభుఁ
        దెగువచెండువరాయదేవనృపతి
నప్పచిచెన్రాజు నారాఘవాఖ్యుని
        నేచి విఠ్ఠలదేవు రాచవారిఁ
దిరుమలేంద్రుని నన్నదేవు శ్రీనాథుని
        వీరాదిగాఁ గల విభులఁ దొల్లి


గీ.

చంపి జయముఁ గొనియెఁ[2] జాళిక్యభూపాల
విదళనుండు[3] సింగవిభునిమాదు
సమరమందు గెలువు సంబెటపిన్నని
విభవసంగ మాదవిభునిలింగ.

128


క.

అంభోనిధినలయములోఁ
గుంభిని గల రాజులెల్లఁ గూలిరి నీచే
రంభాతిలోత్తమాదుల[4]
సంభోగముకొఱకు మాదజనపతిలింగా.

129


క.

సురథాను గెల్చినాఁడవు
నరవరు ధట్టించి పంచినాఁడవు మున్నే
కరిరాజుఁ దోలినాఁడవు
సరియెవ్వరు నీకు మాదజనపతిలింగా.

130


వ.

ఆలింగమ[5]నేఁడె యశ్వపతి గజపతుల గెల్చి మూరురాయరగండబిరుదు

  1. A.B. భలర్గ
  2. A.B. చేకొనియె
  3. A.B. విదళితుండు
  4. A.B. రంభాదిమేనకాదులు
  5. A.B. సింగమ