పుట:వెలుగోటివారి వంశావళి.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

వెలుగోటివారి వంశావళి


చాటిచెన్నయగారిఁ జదిపి చట్టలు చీరి
        కొండమల్లయగారిఁ గొట్టినాఁడు
గోరంట్లతిప్పనిఁ గొట్టి కోటెక్కియు[1]
        వేఁగరికులమెల్ల వెదకినాఁడు
చిటివల్లభయ్యను జెట్లను బడఁదోలి
        పాణెమురాజును బఱపినాఁడు
రంగయభీముని రాజసంబునఁ దోలి
        సాళ్వతిప్పని నేలఁ జదిపినాఁడు
పాండూరియడవిని బరఁగు మన్నీలను
        దూల్చి[2] గొందులు చొరఁదోలినాఁడు
ముచ్చకంపయ కుఱ్కి మునుపుగాఁ బడ మోఁది
        పూలగంగు దళముఁ[3] బొడిచినాఁడు
రాజు లెప్పుడు మెచ్చ రామరాజ్యంబుగా
        నెసఁగి[4] రాజాచలం బేలినాఁడు
దండిమై ముప్పదిరెండు దుర్గంబుల
        నేకధాటీగతి నెక్కినాఁడు
వీరభద్రుని దొడ్డవిభువేమనృపతుల
        రట్టఁడై కాలందెఁ బెట్టినాఁడు
ఘనమూరురాయర గండపెండారంబుఁ
        బెనుపొంద డాకాలఁ బెట్టినాఁడు
రాజమాత్రుండె ఖడ్గనారాయణుండు
చారుతరమూర్తి రాజులచక్రవర్తి
గాయగోవాళుఁ డువ్వెత్తు[5]గండఁ డనఁగ
లీల నొప్పారు మాదయలింగవిభుఁడు.

126
  1. A.B. కోటయు నెక్కి
  2. A.B. తోలి
  3. R.V.C p 119 పూలసంగనిఫౌంజు
  4. A.B. యసంగ; R.V.C. p. 119. ఎలఁగి
  5. R.V.C. p 119; A గోపాళుడురు వెత్తు; B. గండగోపాలుడురు వెత్తు