పుట:వెలుగోటివారి వంశావళి.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

51


సంగరస్థలమున సింగళదేవుని
        శిరము ద్రుంచటు[1] కీర్తిఁ బరఁగినాఁడు
మలకపోలార్జును మదమల్లఁ గ్రక్కించి
        యన్నయాదవకొండఁ గొన్నవాఁడు
గర్వించి తలపడ్డ గండరగండని
        మెట్టఁ గదిసి తల మెట్టినాఁడు[2]
కుటిలశాత్రవకోటిఁ గోవిలకొండఁ దా
        మగతనంబున[3] బిల్కు మార్చినాఁడు
ఉచ్చిళ్లకోటకై యుద్రేకమునఁ బోయి
        చెలఁగటు[4] నీరుగాఁ జేసినాఁడు
ఉర్విలోఁ బొగడొందు నుపనూరి సింహంబుఁ[5]
        జెనకిన రిపుకోటిఁ జెండినాఁడు
శాంతభిక్షావృత్తి జగమెల్ల నెఱుఁగ శ్రీ
        శైలపట్టంబునఁ జాటినాఁడు[6]
బుక్కరాజునుఁ బట్టి పొడిచేటికోటలో
        గజపతి మెచ్చఁగాఁ గాఁచినాఁడు
దొరయు[7] సల్కయవారిఁ దోలి తొప్పరలాడి
        బాగవాడొద్దను బఱపినాఁడు[8]

  1. R.V C. p 118 ద్రుంచెటు
  2. A.B. మెట్టగదినెన శిరములు మెట్టినాఁడు. R.V.C. p 118 మెట్టగదియ తలఁగొట్టినాఁడు.
  3. B. తామసతనంబున
  4. R.V.C. చెంగేటి
  5. R.V.C. బొగడొందు | నుప్పూరి చెంగట
  6. R.V.C. (p. 119) has the following correction,
    “శాతశిక్షావృత్తి జగ మెల్ల నెఱుఁగ శ్రీశైలపట్టణము దా నేలినాఁడు.
    A.B. శ్రీశైలపట్టంబుగా నిల్పినాడు
  7. A.B. యోగి
  8. A.B. బాపినాఁడు