పుట:వెలుగోటివారి వంశావళి.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

వెలుగోటివారి వంశావళి


మణుగూరికోటలో మండువమల్నేఁడు[1]
        ప్రతిఘటించిన నిల్చి ప్రామినాఁడు[2]
శరణుఁ జొచ్చిన నొచ్చి[3] సరిమఖానునిఁ బట్టి[4]
        గౌతమీతటమునఁ గాఁచినాఁడు
పోరిలోననె గన్నభూపాలుఁ జెఱవెట్టి
        ధృతి గొత్తకొండ సాధించినాఁడు
యెదిరి విఠ్ఠమరాజు[5] కదనోర్వి గర్వింప
        నణఁచి యింద్రునివీటి కంపినాఁడు
సింహవిక్రమపురి సింగమపలె గొని[6]
        గోపాలకృష్ణుని గొట్టినాఁడు
మెండుగ వీఁకమైఁ గొండపల్మన్నీలు
        పూని వచ్చిన నూనపుచ్చినాఁడు
ఎదిరించ నేలూర[7] నెల్లూరితిప్పని
        ముదలించి[8] పటుగతి మోదినాఁడు
కుంట్లూరికోటపై గుండ్రౌతురాజులు[9]
        మొత్తమై యెదిరిన మొత్తినాఁడు
బాణాలకోటపై బ్రకటించి యుగ్రత
        గాలాగ్నిరుద్రుఁడై కాల్చినాఁడు
తొరగంటిబాదావి[10] తురకలఁ బరిమార్చి
        పట్టణంబుల రెంటఁ[11] బరఁగినాఁడు

  1. R.V.C. p118 మన్నీడు
  2. R.V.C. 118 తూలబరచినాఁడు. A.B. తరిమినాఁడు
  3. R.V.C. 118 మెచ్చి
  4. A. సరమఖానుని గొట్టి B. సరణిఖానుని గొట్టి; R.V.C. p 118 సరిమఖానునిబట్టి
  5. R.V.C. p 118 అదిరి విధమరాజు
  6. V. R. (Ac. iii. p 104.) సింగమపలెకాని
  7. A.B. వేలూర
  8. R.V.C. p118 మొదలింట
  9. A.B. రాజుల
  10. R.V.C. p118 దాబాజి
  11. R.V.C. p118 వెంటఁ బ్రబలినాఁడు