పుట:వెలుగోటివారి వంశావళి.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారి వంశావళి

49


నల్లగొం డటుల విన్నాణంబుగా[1] నెక్కి
        కపటాహితుల నేల గలిపినాఁడు
గంగ సాక్షిగ మీఱి[2] కదిసి రాజమహేంద్ర
        వరము చూఱలుగొని వచ్చినాఁడు
సురథానుకొలువులోఁ బొరసెడు[3] బిరుదుకై
        ముద్దుఢక్కనివెన్ను మొత్తినాఁడు
తేజంబుగాఁ బ్రౌఢదేవరాయలచేత[4]
        నరుదుగా బిరుదందె నందినాఁడు[5]
ఇనతనూజుని భంగి నినుగుర్తికోటలో
        లీల శత్రుల విభాళించినాఁడు
ధీరుఁడై యల్లావుదీ[6] సురథానుతో[7]
        నెమ్మెగా భువనాద్రి నెక్కినాఁడు
గెంటించి బలిమి సిఖేంద్రఖానుని దోలి
        యెలమి రాజ్యంబుఁ దా నేలినాఁడు
యెడవంక[8] బలవంక నేచి[9] తాఁకినయట్టి[10]
        బలిదఖానుని భంగపఱచినాఁడు
రణకేళి నెఱుకవరప్రాంతమున గొట్టి
        మన్నెజంగిలి[11] నేపుమాపినాఁడు

  1. R.V.C. నల్లకొండలను సన్నాహంబుగా నెక్కి; A.B. నల్లగొండటులు సన్నాణంబు నెక్కి
  2. R.V.C. p117; A B. మెరసి
  3. R.V.C. p117; A B. వొరకెడు
  4. R.V.C. దేవప్రాఢరాయలచేత
  5. R.V.C. బిరుదందె లందినాఁడు
  6. A. అల్లాడధీ; B. అవాడధీ
  7. A.B. చే
  8. A.B. యలవంక
  9. R.V.C. p. 118 బలంవంకలార్చి
  10. R.V.C. p. 118 బట్టి
  11. R.V.C. p. 118 జంగుల