పుట:వెలుగోటివారి వంశావళి.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

వెలుగోటివారి వంశావళి


భువిలోన ననవేముభూపాలుఁ జెఱవెట్టి
        యతనిని వేడ్కతో నంపినాఁడు
................................................
చలమర్తిగండఁడై సంబెట పిన్ననిఁ
        బ్రౌఢుఁ డెఱుంగను బఱపినాఁడు
నూతనగిరి నుగ్గునూచంబుగా నెక్కి
        యన్నగన్నని గర్వమణఁచినాఁడు.
ధరణీవరాహుఁడై తల్లడిల్లఁగఁ బొంచి
        చెంచువలయ మెల్లఁ జెండినాఁడు
సింహఘాతకుఁ దారసించి సంగరకేళి
        మస్తఖానుని గెల్చి మసలినాఁడు
నాణెంబుగా సబ్బినాటి రాజ్యం బెల్ల
        నద్భుతంబుగఁ జూఱలాడినాఁడు
కృష్ణవెణ్ణా[1]జలక్రీడావినోదుఁడై
        యఖిలదానముల సొంపడరినాఁడు[2]
జగనొబ్బగండఁడై చలఁగి [3]రేచర్లను
        దురకదళముతలల్ ద్రుంచినాఁడు
చటులోగ్రగతి రాయశరభమై[4] యవలీలఁ
        దిరుగ సింహాద్రి సాధించినాఁడు
పరదళంబులు పటాపంచలై పాఱంగ
        నెన్న గౌరవకొండ నెక్కినాఁడు
కేళాదిరాయఁడై కెరలి పోరట్లను[5]
        చాదుఖానుని వెన్నుఁ జఱచినాఁడు

  1. A. కృష్ణవెణ్యా B. కృష్ణవేణ్యీ
  2. A.B. అఖిలదానవులసొం పడచినాఁడు; R.V.C. p. 117 యఖిలదారుణుల సొం పడచినాఁడు,
  3. The correct form 16 చెలఁగి
  4. R.V.C. p. 117 శలభమై
  5. R.V.C. p. 117 గోరంట్లను చారభానుని